Band Melam : కంటెంట్ లేదు.. కలెక్షన్ లేదు.. ఆడియన్స్ తిడుతున్నా మీడియాపై ఫైర్ అయిన మూవీ టీమ్..
సినిమాలు ఫ్లాప్ అయినప్పుడే మూవీ టీమ్స్ కి రివ్యూలు గుర్తొస్తాయి. సినిమా హిట్ అయితే రివ్యూలతో ఎవరికీ ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. (Band Melam)
- Saketh U
- Published On : April 1, 2026 / 07:58 PM IST
Band Melam
Band Melam : ఈ మధ్య కొన్ని సినిమాల వాళ్ళు తమ సినిమాలో కంటెంట్ లేకుండా ఫ్లాప్ టాక్ వస్తే, కలెక్షన్స్ రాకపోతే కేవలం రివ్యూలు చెప్పే వాళ్ళ వల్లే, రాసే వాళ్ళ వల్లే సినిమాలు నష్టపోతున్నాయి అని స్టేజి ఎక్కి స్పీచ్ లు ఇస్తున్నారు. సినిమా హిట్ అయి డబ్బులు వస్తే రివ్యూలు ఎలా ఉన్నా ఓకే అనేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం విజయశాంతి అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా సమయంలో కూడా స్టేజిపైకి ఎక్కి రివ్యూలు రాసేవాళ్ళు గురించి ఇలాగే ఫైర్ అయ్యారు.
ఇప్పుడు తాజాగా బ్యాండ్ మేళం సినిమా టీమ్ కూడా తమ సినిమాలో లోపాలు పెట్టుకొని రివ్యూల వల్లే సినిమా పోయిందంటూ ఫైర్ అవుతున్నారు. కోర్ట్ సినిమాతో హిట్ కొట్టిన హార్ష్ రోషన్ – శ్రీదేవి జంటగా కోన వెంకట్ నిర్మాణంలో సినిమా అనడంతో కాస్త అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్స్ కూడా బాగానే చేసారు. ఒక సాంగ్ కూడా బాగా వైరల్ అయింది. కానీ థియేటర్ లోకి వెళ్ళాక అది పాత రొటీన్ స్టోరీ, నవ్వు రాని కామెడీ సీన్స్, ఏడుపు రాని ఎమోషనల్ సీన్స్, అస్సలు సెట్ అవ్వని తెలంగాణ యాసతో సినిమా నడిచింది.
ఇటీవల సినిమాలు సక్సెస్ అవ్వకున్నా సక్సెస్ మీట్లు పెడుతున్నారు. అలాగే బ్యాండ్ మేళం టీమ్ కూడా సక్సెస్ మీట్ అని పెట్టింది. కానీ స్టేజిపై మాట్లాడిన వాళ్ళెవరూ సక్సెస్ గురించి కాకుండా ఆ సినిమా రివ్యూల వల్ల ఫెయిల్ అయిందని చెప్పడం గమనార్హం. డైరెక్టర్ అయితే మీ రివ్యూలు మాకు మరణ శాశనాలు అనే పెద్ద పెద్ద డైలాగ్స్ వాడాడు. కోన వెంకట్ అయితే అమెరికా – ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ మా సినిమా మీద పడింది అనడం ఇంకా హైలెట్. మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రివ్యూ రైటర్స్ పై కామెంట్స్ చేసింది. హీరోయిన్స్ రివ్యూలు నెగిటివ్ గా ఇచ్చినా సినిమాకు జనాలు వస్తున్నారు అంటూ మాట్లాడింది.
Also Read : Tovino Thomas : ఇక్కడ కలెక్షన్స్ కావాలి.. కానీ తెలుగు సినిమాలు చేయను అంటున్న మలయాళం స్టార్ హీరో..
ఇలా అందరూ రివ్యూలు, రివ్యూలు చెప్పేవాళ్ళు, రాసేవాళ్ళ మీద తమ అక్కసుని వెళ్లగక్కారు. అంతేకాని సినిమాలో కంటెంట్ లేదు అని ఒప్పుకోరు. ఉయ్యాలా జంపాల సినిమా కథని అటు ఇటు మార్చేసి స్టోరీ లైన్ తీసుకున్నారు. సినిమా చూసి నచ్చకపోతే నెక్స్ట్ సినిమాకు వెళ్లొద్దు అని కోన వెంకట్ అన్నారు. సినిమా చూసిన ఆడియన్స్ ఆ వీడియోల కింద తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కలెక్షన్స్ అయితే ఇప్పటికి అరకోటి షేర్, ఒక కోటి గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు సమాచారం. పెట్టిన సినిమా బడ్జెట్ కూడా రాలేదు.
ఇదే హార్ష్ రోషన్ – ఇదే శ్రీదేవి కలిసి చేసిన కోర్ట్ సినిమాని రివ్యూలలో గొప్పగా చెప్పారు. ఆ సినిమా బాగుంది కాబట్టి చెప్పారు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ విషయం మూవీ టీమ్ మర్చిపోయినట్టు ఉంది. అంతెందుకు అసలు ప్రమోషన్స్ చేయని బాలీవుడ్ ధురంధర్ సినిమాకు మన తెలుగులో 4 రేటింగ్స్ కూడా పడ్డాయి. సినిమా బాగుంటే రివ్యూలు బాగానే వస్తాయి. ఇది మూవీ టీమ్ వాళ్ళు అర్ధం చేసుకోలేకపోయారు. ఆర్టిస్టులు అంటే కొత్త అనుకోవచ్చు. సీనియర్, ఎన్నో సినిమాలను చూసి, మీడియాతో ఎంతో అనుబంధం ఉన్న కోన వెంకట్ గారికి కూడా తెలియదా సినిమాలో కంటెంట్ లేకపోతే రివ్యూలు ఎంత బాగా రాసినా సినిమా ఆడదు అని.
సక్సెస్ మీట్ అని పెట్టి మీడియా మీద, రివ్యూలు చెప్పేవాళ్లు మీద, రాసేవాళ్ళ మీద తిట్టడానికి అన్నట్టు ఆ వేదికని ఉపయోగించారు. రివ్యూలు బాగా రాసిన సినిమాలు ఫ్లాప్ అయినవి చాలా ఉన్నాయి. బాహుబలి సినిమాకు రివ్యూలు నెగిటివ్ గానే వచ్చాయి. కానీ సినిమా పెద్ద హిట్ అయింది. ఇది బ్యాండ్ మేళం టీమ్ మర్చిపోయినట్టు ఉన్నారు. సినిమాలో కంటెంట్ ఉంటె ఏ రివ్యూ ఆడియన్స్ ఆపలేదు. మౌత్ టాక్ తో సినిమాలు హిట్ అవుతాయి. రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ చిన్న సినిమా పెద్ద హిట్ అవ్వలేదా కంటెంట్ తో ఈ విషయం మూవీ టీమ్ కి తెలియదా. పైగా కేవలం తెలుగు మీడియానే కాదు, ఇంగ్లీష్ మీడియా కూడా బ్యాండ్ మేళం సినిమాకు బాగోలేదని రివ్యూలు ఇచ్చాయి.
Also Read : Allu Arjun : బన్నీ సినిమాపై యుద్ధం ఎఫెక్ట్.. ఆగిపోయిన షూటింగ్..
అయినా ఒక వస్తువు కొనేటప్పుడు అది మంచిదా కాదా, ఎలాంటిది అన్ని చెక్ చేసి దాని గురించి ఆన్లైన్ లో రివ్యూలు చూసి కొంటాము. కానీ డబ్బులు పెట్టి సినిమాకు వెళ్ళేవాళ్ళు సినిమా ఎలా ఉంది అని రివ్యూల ద్వారా తెలుసుకొని వెళ్లకూడదా? సినిమాలు ఫ్లాప్ అయినప్పుడే మూవీ టీమ్స్ కి రివ్యూలు గుర్తొస్తాయి. సినిమా హిట్ అయితే రివ్యూలతో ఎవరికీ ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అసలు రివ్యూలకు సినిమా రిజల్ట్ కి ఎలాంటి సంబంధం లేదు అని కొంతమంది మూవీ టీమ్స్ ఎప్పుడు తెలుసుకుంటారో..
