Tovino Thomas : ఇక్కడ కలెక్షన్స్ కావాలి.. కానీ తెలుగు సినిమాలు చేయను అంటున్న మలయాళం స్టార్ హీరో..
తెలుగు సినిమాకు మార్కెట్ ఎక్కువ ఉండటంతో మలయాళం నటీనటులు కూడా తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. (Tovino Thomas)
Tovino Thomas
Tovino Thomas : మన తెలుగు వాళ్ళు తెలుగు సినిమాల కంటే బయటి సినిమాలనే ఎక్కువ ఆదరిస్తారు అప్పుడప్పుడు. కరోనా తర్వాత మలయాళం సినిమాలను ఎక్కువ ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మలయాళంలో హిట్ అయిన సినిమాలను ఇక్కడ కూడా ప్రమోషన్స్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు. తెలుగు సినిమాకు మార్కెట్ ఎక్కువ ఉండటంతో మలయాళం నటీనటులు కూడా తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు.
ఇటీవల 2018, ప్రేమలు, ARM, మంజుమెల్ బాయ్స్, భ్రమయుగం,.. ఇలా చాలా మలయాళం సినిమాలు తెలుగులో కూడా హిట్ అయ్యాయి. దీంతో మలయాళం సినిమాలు డబ్బింగ్ చేసి వరుసగా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మలయాళం స్టార్ హీరో టోవినో థామస్ పళ్లి చట్టంబి అనే సినిమాతో ఏప్రిల్ 10న రాబోతున్నాడు. మలయాళం టైటిల్ తోనే తెలుగులో రిలీజ్ అవుతుంది ఈ సినిమా.
Also Read : Allu Arjun : బన్నీ సినిమాపై యుద్ధం ఎఫెక్ట్.. ఆగిపోయిన షూటింగ్..
దీంతో గత రెండు రోజులుగా తెలుగులో ప్రమోషన్స్ చేస్తుంది ఈ మూవీ టీమ్. ఈ ప్రమోషన్స్ లో భాగంగా నిన్న మీడియాతో మాట్లాడుతూ, మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ టోవినో థామస్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎన్టీఆర్ – నీల్ సినిమాలో టోవినో థామస్ నటిస్తున్నాడు అని వార్తలు రాగా దానిపై క్లారిటీ ఇవ్వమని అడిగారు జర్నలిస్టులు. దీనికి టోవినో థామస్ సమాధానమిస్తూ.. తెలుగు సినిమాలు ఎక్కువ రోజులు షూట్ చేస్తారు. ఒక సినిమా కోసం నేను మలయాళంలో మూడు నాలుగు సినిమాలు వదులుకోలేను, మేము సినిమాని సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేస్తాము, ఇక్కడ సంవత్సరం పైనే పడుతుంది. నేను మూడు నెలల కంటే ఎక్కువ రోజులు డేట్స్ ఇవ్వలేను అందుకే ఆ సినిమా చెయ్యట్లేదు అంటూ వ్యాఖ్యలు చేయడంతో ఇవి వైరల్ గా మారి టోవినో థామస్ పై టాలీవుడ్ ఫ్యాన్స్ నుంచి విమర్శలు వచ్చాయి.
అయితే నేడు మరో ప్రెస్ మీట్ లో టోవినో థామస్ దీనిపై స్పందిస్తూ.. నేను చెప్పింది నెగిటివ్ గా వెళ్ళింది. నాకు ఎన్టీఆర్, నీల్ సినిమాలో నటించాలని ఉన్నా డేట్స్ అడ్జస్ట్ కాలేదు, నేను ఒకేసారి ఎక్కువ సినిమాలు మేనేజ్ చేయలేను అని చెప్పారు. అలాగే మలయాళం టైటిల్ తోనే ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు ఆ టైటిల్, నేటివిటీ ఇక్కడ కనెక్ట్ అవుతుందా అని అడగ్గా బాహుబలి మా దగ్గర కూడా అదే టైటిల్ తో రిలీజ్ చేసారు కదా అది మాకు కనెక్ట్ అవుతుందా కానీ చూడలేదా అని కొంచెం హార్ష్ గానే సమాధానమిచ్చారు.
Also Read : Dhurandhar : వామ్మో ఏడున్నర గంటల సినిమా.. రిలీజ్ కి రెడీ చేస్తున్న మూవీ టీమ్..
అయితే మీకు ఇక్కడ కూడా ఫ్యాన్స్ ఉన్నారు కదా డైరెక్ట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు? దుల్కర్, పృథ్వీరాజ్ సుకుమారన్, చాలా మంది మలయాళ నటీనటులు ఇక్కడ తెలుగులో డైరెక్ట్ సినిమాలు చేస్తున్నారు కదా అని అడగ్గా టోవినో థామస్ సమాధానమిస్తూ.. నా మలయాళ సినిమాలతో ఇక్కడ నాకు గుర్తింపు వచ్చినప్పుడు నేను డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయాల్సిన అవసరం ఏముంది. వేరే హీరోలు చేస్తే వాళ్ళు అక్కడ ఇక్కడ డేట్స్ మేనేజ్ చేసుకోగలరు, లాంగ్వేజ్ నేర్చుకోగలరు. కానీ నేను డేట్స్ మేనేజ్ చేసుకోలేను, లాంగ్వేజ్ సమస్య ఉంది. అందుకే నేను డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయను అని గట్టిగానే చెప్పారు. అంతేకాకుండా తెలుగు నటీనటులు మలయాళం వచ్చి సినిమాలు చేస్తారా అని అడిగారు.
కానీ ఇక్కడ ఫ్యాన్స్ కోసం, సినిమా లవర్స్ కోసం తన సినిమాలు తెలుగులో రిలీజ్ చేస్తాను అని, తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా పెద్దది అని, నేను కూడా నా చిన్నప్పట్నుంచీ తెలుగు సినిమాలు చూస్తున్నాను అని చెప్పుకొచ్చారు. దీంతో టోవినో థామస్ ని పలువురు సపోర్ట్ చేస్తుండగా మరికొంతమంది విమర్శిస్తున్నారు. తెలుగు సినిమాలపై టోవినో థామస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారాయి. కొంతమంది అయితే తెలుగులో టోవినో థామస్ సినిమాలు బ్యాన్ చేయండి అంటూ పోస్టులు కూడా పెడుతున్నారు. ఇక్కడ కలెక్షన్స్ కావాలి, ఇక్కడ సినిమాలు రిలీజ్ చేస్తారు కానీ ఇక్కడ తెలుగు సినిమాలపై నెగిటివ్ కామెంట్స్ చేస్తారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అయితే తెలుగు సినిమాలు తీయడానికి చాలా సమయం తీసుకుంటారు అనేది నిజమే అని కొందరు సపోర్ట్ చేస్తున్నారు.
