Bandla Ganesh
Bandla Ganesh: మా (Movie Artist Association)లో ఎలాంటి కులమతాలకు తావేలేదని.. ఇక్కడ అందరూ ఒక్కటేనని సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ వెల్లడించారు. మా ఎన్నికలలో పోటీచేస్తున్న ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మద్దతు ప్రకటించిన బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్ తన సేవా కార్యక్రమాలతో మహబూబ్ నగర్ జిల్లాకు మంచి పేరు తెచ్చారని.. గ్రామాన్ని దత్తత తీసుకొని ఆయన చేసిన మంచి పనులను చూసి.. మాలో కూడా అదే చిత్తశుద్ధితో పనిచేస్తారనే ఆయన వెంట ఉన్నామన్నారు.
ముఖ్యంగా మాలో కులాలు, మతాలు లేవని.. అందరూ ఒక్కటేనని.. అలా అనుకొనేవారిలో ప్రకాష్ రాజ్ ముందుంటాడని.. ఆయన మనస్తత్వాన్ని చూసే ఆయన వెనకాల వున్నామన్నారు. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనేది ఏమి ఉండదని.. నటులంతా యూనివర్సల్ అయిపోయారన్నారు. ప్రభాస్ దేశాన్ని ఏలుతుంటే.. రాజమౌళిని ఇంగ్లీష్ సినిమాలు తియ్యమని కోరుతున్నారని.. వాళ్ళకి లేని లోకల్ నాన్ లోకల్ మాకెందుకు ఉంటుందన్నారు. ఇక్కడ అందరూ గొప్పవారేనని.. వాళ్ళల్లో ప్రకాశ్ రాజ్ వెంటే మేము ఉండాలని నిర్ణయించుకున్నామన్నారు.
మాకు పెద్ద వాళ్ల సహకారం ఉంటుందన్న గణేష్ వారి అండతోనే ప్రకాష్ రాజ్ ప్యానల్ గెలిచి.. ముందుకు వెళ్తుందన్నారు. కేవలం 900 మంది సభ్యులున్న మా ప్యానల్ ఎన్నికలను భూతద్దంలో చూసి ఇక్కడ ఏదేదో జరిగిపోతుందని ప్రచారం జరుగుతుందని.. ఇది మా కుటుంబంలో అంశం మాత్రమేనని.. మా అభివృద్ధి కోసం మేము ఏర్పాటు చేసుకున్న ఎన్నికలు మాత్రమేనని.. దీనిని అలానే చూడాలన్నారు.
Read: Prakash Raj: మా చాలా చిన్న అసోషియేషన్.. పొలిటికల్ పార్టీ కాదు..