Prakash Raj: 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. నాన్‌లోకల్ ఇప్పుడే గుర్తుకు వచ్చిందా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు పెద్ద కుమారుడు, హీరో విష్ణుతో పాటు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోటీకి దిగడంతో యావత్ రెండు తెలుగు రాష్ట్రాలను తనవైపుకు తిప్పుకోగా..

Prakash Raj: 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. నాన్‌లోకల్ ఇప్పుడే గుర్తుకు వచ్చిందా?

Prakash Raj Said Our Maa A Very Small Association Its Not A Political Party

Updated On : June 25, 2021 / 12:42 PM IST

Prakash Raj: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు పెద్ద కుమారుడు, హీరో విష్ణుతో పాటు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోటీకి దిగడంతో యావత్ రెండు తెలుగు రాష్ట్రాలను తనవైపుకు తిప్పుకోగా జీవితా రాజశేఖర్ కూడా పోటీకి దిగడంతో మా ఎన్నిక త్రిముఖ పోటీగా మారిందని అనుకున్నారు. కానీ అంతలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమా కూడా రంగంలోకి దిగడంతో మా ఎన్నికలా మజాకా అన్న చందంగా మారింది.

కాగా, శుక్రవారం తన ప్యానెల్ తో చర్చలు జరిపిన ప్రకాష్ రాజ్ తమ ఎజెండాను కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రకాష్ రాజ్.. పాతికేళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నానని.. నేను ఇప్పుడు పోటీకి దిగడంతో లోకల్, నాన్ లోకల్ అంశాన్ని తెరమీదకి తెస్తున్నారన్న ప్రకాష్ రాజ్.. తాను గ్రామాలను దత్తత తీసుకున్నప్పుడు నాన్ లోకల్ గుర్తుకు రాలేదా.. 9 నంది అవార్డులు వచ్చినపుడు నాన్ లోకల్ గుర్తురాలేదా అని ప్రశ్నించారు. మా ప్యానల్ కోపంతో పుట్టింది కాదని ఆవేదనతో పుట్టింది మాత్రమేనన్నారు.

అకారణంగా ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోవాలని మాకు లేదని.. సంవత్సరం నుండే మా ఎన్నికల ప్రయత్నాలను మొదలు పెట్టామని.. అనుకున్నట్లుగానే పోటీకి దిగమన్నారు. మా అనేది చాలా చిన్న అసోషియేషన్ అని.. ఇదేమీ పొలిటికల్ పార్టీ కాదన్నారు. దీనిని పెద్ద పోరుగా చూడాల్సిన అవసరం లేదని.. అలా చిత్రీకరించవద్దని కోరారు. మా అసోషియేషన్లో చాలా సున్నితమైన అంశాలున్నాయని.. ఇక్కడ అందరూ కావాల్సినవాళ్ళేన్నారు. కళాకారులు యూనివర్సల్ గా ఉంటారని.. ప్రతి ఒక్కరూ ప్రశ్నించేవారేనని.. తాను పదవి కోసం ఇక్కడ పోటీచేయడం లేదన్నారు.

Read: Prakash Raj: సీఎంలైన కేసీఆర్, జగన్ పేర్లతో మాపై ప్రచారమా?