Bandla Ganesh
Bandla Ganesh : మౌళి, శివాని జంటగా ఇటీవల వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమా పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కేవలం రెండున్నర కోట్లతో తెరకెక్కించగా 32 కోట్లు కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. యూత్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. తాజాగా లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ గెస్ట్ గా హాజరయ్యాడు. ఇదే ఈవెంట్ కి బండ్ల గణేష్ కూడా గెస్ట్ గా హాజరయ్యాడు.(Bandla Ganesh)
లిటిల్ హార్ట్స్ సక్సెస్ ఈవెంట్లో బండ్ల గణేష్ మౌళితో స్టేజిపై మాట్లాడుతూ.. ఇదంతా అబద్దం. ఈ ట్వీట్స్, ఫోటోలు, సక్సెస్ ఒక మాయ. సినిమా రిలీజ్ కి ముందు ఎలా ఉన్నావో అలాగే ఉండు. చంద్రమోహన్ లాగా ఉండు. నీ గాజువాక బేస్ నువ్వు మర్చిపోకు. ఇక్కడ నీ సక్సెస్ చూసి బాబు నువ్వు తోపు అనుకుంటూ వస్తారు. నీ ముందు హీరోలు కూడా పనిచేయరు అంటారు. అది నమ్మకు. ఇక్కడ మాఫియా మనల్ని బతకనివ్వదు. ఈ మాఫియాకు దూరంగా ఉండాలి మనం. అందుకే నేను ఇక్కడ ఏం చేసినా నా కోళ్ల ఫారం చూసుకుంటాను.
Also Read : Balakrishna : మోకాళ్ళ మీద కూర్చొని మరీ ఆ పిల్లలతో ఫోటో దిగిన బాలయ్య.. ఈ క్యూట్ పిల్లలు ఎవరో తెలుసా?
ఇక్కడ ఎవరు బాగుంటే అబ్బా నువ్వు సూపర్ అంటారు. అవన్నీ నమ్మకు. నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. నువ్వు స్టార్ అవ్వాలని అనుకోకు, మంచి నటుడివి నువ్వు. నటుడు అవ్వాలని కోరుకుంటున్నాను. రౌడీ షర్ట్ ఇచ్చాడు, మహేష్ ట్వీట్ వేసాడు, బండ్ల గణేష్ పొగిడాడు ఇవన్నీ ఈ ఫ్రైడే వరకే. ఇంకో ఫ్రైడే ఇంకో మౌళి వస్తాడు. వీటన్నిటికీ ప్రిపేర్ అయి ఉండు. దయచేసి దురలవాట్లు చేసుకోకు. ఇండస్ట్రీలో ఎవర్ని నమ్మకు అంటూ చెప్పాడు. దీంతో బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో వైరల్ గా మారాయి.
Also Read : Beauty Review : ‘బ్యూటీ’ మూవీ రివ్యూ.. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ కి మైండ్ బ్లాక్..