బందోబస్త్ రివ్యూ
తమిళ స్టార్ హీరో సూర్య, లెజెండరీ యాక్టర్ మోహన్ లాల్, ఆర్య నటించిన మల్టీస్టారర్ యాక్షన్ థ్రిల్లర్ 'బందోబస్త్' రివ్యూ..

తమిళ స్టార్ హీరో సూర్య, లెజెండరీ యాక్టర్ మోహన్ లాల్, ఆర్య నటించిన మల్టీస్టారర్ యాక్షన్ థ్రిల్లర్ ‘బందోబస్త్’ రివ్యూ..
చాలా కాలంగా తన సినిమాలతో ప్రేక్షకులను నిరాశ పరుస్తున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య. సూర్య హీరోగా, లెజెండరీ యాక్టర్ మోహన్ లాల్, ఆర్య, ఆర్య భార్య సయేషా సైగల్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ‘బందోబస్త్’. కోలీవుడ్‌లో ‘కాప్పన్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో బందోబస్త్ పేరుతో రిలీజ్ చేశారు. రంగం ఫేం కెవి.ఆనంద్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ టీజర్లు, ట్రైలర్లు యాక్షన్ మోడ్‌లో ఉండడంతో బందోబస్త్ మీద తెలుగులోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సారైనా సూర్య హిట్ సినిమాను అందించాడా లేదా చూద్దాం..
కథ విషయానికి వస్తే.. దేశ ప్రధాన మంత్రి క్యారెక్టర్‌లో కనిపించిన మోహన్ లాల్ ఒక ఉగ్రవాదుల దాడిలో చనిపోతారు. ఈ కేసు వెనక ఎవరి హస్తం ఉందో తెలుసుకోవడానికి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ కదీర్‌ను నియమిస్తారు. ఈ కేసు వెనక ఉన్న వాళ్ల గురించి తెలుసుకుంటున్న క్రమంలో ఎవ్వరూ ఊహించని విషయాలు బయటకు వస్తుంటాయి. ప్రధానమంత్రి మర్డర్ వెనుక ఇంకా చాలా ఉగ్రవాద గ్రూపులు ఉన్నాయని తెలుసుకుంటాడు. అయితే ఈ కేసుకు బొమన్ ఇరానీ, ఆర్యకు ఉన్న సంబంధం ఏమిటి ? ఈ కేసు వెనుక ఉన్న అసలు నిందితులు ఎవరు ? అంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది.? నిందుతులను కదీర్ పట్టుకున్నాడా లేదా ? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి..
Read Also : గద్దలకొండ గణేష్ రివ్యూ..
ఈ సినిమాలో కదీర్ క్యాక్టర్‌లో సూర్య వన్ మ్యాన్ షోతో సినిమా అంతా తానై నడిపించాడు. మామూలు రైతు నుంచి ప్రధాన మంత్రి సెక్యురిటీ ఆఫీసర్‌గా సూర్య చూపించిన పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్‌కు బాగా నచ్చుతుంది. ప్రధాన మంత్రి పాత్రలో మోహన్ లాల్ యాక్టింగ్ బాగుంది. ఆర్యది చాలా సింపుల్ క్యారక్టర్ అయినా.. మెప్పించాడు. హీరోయిన్‌గా సయేషా పర్వాలేదనిపించింది. ముఖ్య పాత్రలో నటించిన సముద్రఖణి యాక్టింగ్ కూడా బాగుంది. మిగతా నటీనటులు వారి పాత్రలకు న్యాయం చేశారు.
యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన బందోబస్త్ అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే విధంగా తీయడంలో దర్శకుడు కెవి.ఆనంద్ తడబడ్డాడు అనే చెప్పాలి. దర్శకుడు ఎంచుకున్న కథ బాగున్నా, యాక్షన్ డోస్ ఎక్కువైపోయిందీ సినిమాలో. టెక్నికల్‌గా చూస్తే ఎంఎస్.ప్రభు సినిమాటోగ్రఫీ సినిమాను లావిష్‌గా చూపించింది. హరీష్ జైరాజ్ పాటలు ఆకట్టుకోకపోయినా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. లైకా ప్రొడక్షన్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఓవరాల్‌గా చెప్పాలి అంటే.. సినిమా అంతా యాక్షన్‌తో నింపేశాడు. ఇంతమంది స్టార్స్ ఉన్నా వారిని సరిగ్గా వాడుకోలేకపోయాడు. కాస్త కూడా ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం, ఎమోషన్స్ కనెక్ట్ కాకపోవడంతో ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు రుచించకపోవచ్చు.