Bappi Lahiri : రేపు ముంబైలో బప్పీ లహరి అంత్యక్రియలు..

బప్పీ లహరి కుమారుడు బప్పా లహరి ప్రస్తుతం అమెరికా లాస్ ఏంజిల్స్ లో ఉంటున్నారు. తండ్రి మరణ వార్త విని ఆయన వెంటనే బయలుదేరారు. దీంతో కుమారుడు వచ్చాకే అంత్యక్రియలు నిర్వహించనున్నారు....

Bappi Lahiri : రేపు ముంబైలో బప్పీ లహరి అంత్యక్రియలు..

Bappi Lahari

Updated On : February 16, 2022 / 1:23 PM IST

 

Bappi Lahiri :  బాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్, గాయకుడు బప్పీ లహరి మంగళవారం రాత్రి కన్నుమూశారు. బాలీవుడ్ లోనే కాక తెలుగులో కూడా చాలా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని క్రిటీ కేర్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స తీసుకుంటూనే బప్పీ లహిరి మంగళవారం రాత్రి మరణించారు. బప్పి లహరి మృతిపై బాలీవుడ్, టాలీవుడ్ తో సహా దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

నవంబర్ 27, 1952న పశ్చిమ బెంగాల్‌లో జన్మించిన బప్పి లహిరి అన్ని భాషల్లో కలిపి 5000కి పైగా పాటలు పాడారు. ఎన్నో సినిమాలకు సంగీతం అందించారు. 69 ఏళ్ళ వయసులో అనారోగ్యంతో ఆయన మరణించారు. అయితే ఆయన అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు.

Balakrishna : బప్పి లహరి మరణంపై బాలకృష్ణ సంతాపం

బప్పీ లహరి కుమారుడు బప్పా లహరి ప్రస్తుతం అమెరికా లాస్ ఏంజిల్స్ లో ఉంటున్నారు. తండ్రి మరణ వార్త విని ఆయన వెంటనే బయలుదేరారు. దీంతో కుమారుడు వచ్చాకే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బప్పా లహరి ఇవాళ రాత్రి వరకు ఇండియాకి చేరుకోనున్నారు. దీంతో రేపు ఉదయం ముంబైలో బప్పీ లహరి అంత్యక్రియలు అతని తనయుడి చేతుల మీదుగా నిర్వహించనున్నారు.