Beast : భారీ ధరకి విజయ్ ‘బీస్ట్’ తెలుగు రైట్స్
తమిళ స్టార్ హీరో విజయ్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. తెలుగులో కూడా విజయ్ కి అభిమానులు ఉన్నారు. దీంతో విజయ్ అన్ని సినిమాలు తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. గతంలో...

Beast
Vijay : తమిళ స్టార్ హీరో విజయ్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. తెలుగులో కూడా విజయ్ కి అభిమానులు ఉన్నారు. దీంతో విజయ్ అన్ని సినిమాలు తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. గతంలో విజయ్ నుంచి వచ్చిన ‘మాస్టర్’ సినిమా కూడా తెలుగులో మంచి విజయమే సాధించింది. ప్రస్తుతం విజయ్ ‘బీస్ట్’ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాని ట్యాలెంటెడ్ యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించాడు. విజయ్, నెల్సన్ ఇద్దరూ వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉండటంతో ‘బీస్ట్’ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
Ghani : ‘ఆర్ఆర్ఆర్’ సినిమా థియేటర్లలో వరుణ్‌తేజ్
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్స్ తెలుగులో కూడా భారీ విజయం సాధించాయి. తాజాగా రాబోతున్న ‘బీస్ట్’ సినిమా తెలుగులో భారీ బిజినెస్ చేసింది. బీస్ట్ తెలుగు థియేట్రికల్ రైట్స్ దాదాపు 11 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఇటీవల కాలంలో ఓ తమిళ సినిమాకి ఈ రేంజ్ లో తెలుగులో బిజినెస్ అవ్వడం ‘బీస్ట్’తోనే సాధ్యమైంది. ఏప్రిల్ 13న ఈ సినిమా విడుదల అవ్వబోతుంది. మరి ‘బీస్ట్’ తెలుగులో ఏ మేరకు కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.