Bedurulanka 2012
Bedurulanka 2012 Ticket Price : ఇటీవల కాలంలో కాస్త పేరున్న హీరో సినిమా విడుదల అవుతుంది అంటే చాలు మొదటి మూడు రోజులు లేదంటే వారం రోజుల పాటు టికెట్ల ధరలను పెంచడాన్ని చూస్తూనే ఉన్నాం. అయితే.. ఇందుకు విరుద్దంగా బెదురులంక 2012 (Bedurulanka 2012) చిత్ర బృందం ఉన్న టికెట్ల ధరలను తగ్గించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. మల్టీఫెక్స్‌లో రూ.350 ఉన్న టికెట్‌ను రూ.250కి, రూ.295 ఉన్న టికెట్‌ను రూ.200కి అదే విధంగా సింగిల్ స్క్రీన్స్‌లో రూ.175 ఉన్న టికెట్‌ను రూ.150కి, రూ.150 ఉన్న టికెట్‌ను రూ.110కి, రూ.80 ఉన్న టికెట్‌ను రూ.50కి తగ్గించినట్లు తెలిపింది. ప్రేక్షకుల కోసమే ఇలా చేసినట్లు చెప్పింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్ ప్రారంభమైనట్లు వెల్లడించింది.
Naresh-Pavitra : పవిత్రతో నరేష్ పెళ్లిపై కొడుకు నవీన్ రియాక్షన్.. బయట చాలామంది..
ఈ చిత్రంలో కార్తికేయ (Karthikeya) హీరోగా నటిస్తుండగా డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty) హీరోయిన్. నూతన దర్శకుడు క్లాక్స్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అజయ్ ఘోష్, సత్య, ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనులు కీలక పాత్రల్లో నటిస్తుండగా లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే టికెట్ల ధరలను తగ్గించారు.
Slashed the prices, only for you! ??
Goo and book your tickets for #Bedurulanka2012 right away?
?️ https://t.co/BPMylcZpH6#Bedurulanka2012onAUG25 ?@ActorKartikeya @iamnehashetty @yesclax @Benny_Muppaneni #Manisharma @SonyMusicSouth pic.twitter.com/IE12EuPSFV
— Loukya entertainments (@Loukyaoffl) August 24, 2023
Sonu Sood : ఓ సామాన్యుడి కల పైలట్.. నిజం చేసిన సోనూసూద్.. నిజమైన హీరో నువ్వే బాసూ..!