Actress Sukanya: 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లి..? పిల్లలు పుడితే అమ్మా అని పిలుస్తారా..? లేదంటే అమ్మమ్మ అనా..!
భారతీయుడు, పెద్దరికం వంటి టాలీవుడ్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి సుకన్య(Sukanya). ఒకప్పుడు హీరోయిన్‌గా తెలుగు, తమిళ సినిమాల్లో నటించి అలరించిన ఆమె ప్రస్తుతం సహాయక పాత్రలు చేస్తోంది.

Actress Sukanya
Actress Sukanya Second Marriage : ‘భారతీయుడు’, ‘పెద్దరికం’ వంటి టాలీవుడ్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి సుకన్య(Sukanya). ఒకప్పుడు హీరోయిన్‌గా తెలుగు, తమిళ సినిమాల్లో నటించి అలరించిన ఆమె ప్రస్తుతం సహాయక పాత్రలు చేస్తోంది. మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ సినిమాలో మహేశ్‌కు తల్లిగా కనిపించింది. ప్రస్తుతం ఆమె వయసు 50 ఏళ్లు. 2002లో శ్రీధర్ రాజగోపాలన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లింది. అయితే.. ఏమైందో తెలీదు కానీ సంవత్సరంలోపే అతడి నుంచి విడిపోయి స్వదేశానికి తిరిగి వచ్చి సహాయక పాత్రలు చేస్తోంది.
ప్రస్తుతం ఒంటరిగానే జీవిస్తోంది. అయితే.. ఇటీవల ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందని తమిళ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆమె ఓ సంపన్న వ్యాపారవేత్తతో నిశ్చితార్థం చేసుకుందని, త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని ఆ వార్తల సారాంశం. కాగా.. వీటిపై సుకన్య స్పందించింది. ఆ వార్తలను కొట్టి పారేసింది. అవన్నీ నిజం కాదని చెప్పుకొచ్చింది.
Sonu Sood : ఓ సామాన్యుడి కల పైలట్.. నిజం చేసిన సోనూసూద్.. నిజమైన హీరో నువ్వే బాసూ..!
మొదటగా ఈ వార్తలను విని తాను షాకైనట్లు తెలిపింది. తనకు మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పింది. ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నట్లు వెల్లడించింది. తన కెరీర్ తో పాటు కుటుంబం, స్నేహితులు ఉన్నారని, ఇంతకు మించి ఇంకేం అవసరం లేదంది. తన వయస్సు 50 ఏళ్లు అని, తాను ఒకవేళ రెండో పెళ్లి చేసుకుని పిల్లలను కంటే పుట్టే పిల్లలు తనను ఏమని పిలవాలని ప్రశ్నించింది. ఆ పిల్లలను తనను అమ్మా అని పిలుస్తారా..? లేదంటే అమ్మమ్మ అని పిలుస్తారా చెప్పాలంటూ నవ్వేసింది.
మొత్తంగా తన రెండో పెళ్లి వార్తలను ఆమె ఖండించింది. కాగా.. ఆమెపై రూమర్లు రావడం ఇదే మొదటి సారి కాదు. 2017లోనూ ఆమె ఓ డాక్టర్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలోనూ ఆమె ఆ వార్తలను ఖండించింది.
Naveen Vijaya Krishna : విజయ్ నిర్మల కోరిన ఏకైక కోరిక.. అందుకే హీరోగా ఎంట్రీ..