Bellamkonda Sai Sreenivas next movie with Director Sagar K Chandra
Bellamkonda Sai Sreenivas : భీమ్లా నాయక్(Bheemla Nayak) సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ లోకి వచ్చాడు డైరెక్టర్ సాగర్ కే చంద్ర(Sagar K Chandra). అనసూయ, అమరావతి.. లాంటి పలు సినిమాలకు రవిబాబు(Ravi Babu) వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సాగర్ రాజేంద్రప్రసాద్ ‘అయ్యారే’ సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఆ తర్వాత నారా రోహిత్(Nara Rohit), శ్రీ విష్ణు(Sree Vishnu)తో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అనే సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయినా విమర్శకుల నుంచి ప్రశంశలు దక్కించుకున్నాయి.
ఈ రెండు సినిమాల తర్వాత దాదాపు ఆరేళ్ళ గ్యాప్ తీసుకున్న సాగర్ చంద్ర గత సంవత్సరం పవన్, రానా కాంబినేషన్ లో వచ్చిన ‘భీమ్లా నాయక్’ సినిమాతో డైరెక్టర్ గా మరోసారి తెరపైకి వచ్చాడు. ఈ సినిమాకి వెనకుండి మాటలు రాసింది త్రివిక్రమ్ అయినా ముందుండి తెరమీద అద్భుతంగా చూపించింది మాత్రం సాగర్ చంద్రనే. ఈ సినిమా హిట్ అవ్వడంతో మరోసారి టాలీవుడ్ లో సాగర్ బిజీ అవుతాడు అని అంతా అనుకున్నారు. కాని ఈ సినిమా రిలీజయ్యాక చాన్నాళ్లు సాగర్ చంద్ర తన నెక్స్ట్ సినిమాని ప్రకటించలేదు.
తాజాగా ఇటీవల బెల్లంకొండ్ర శ్రీనివాస్ తో సాగర్ చంద్ర సినిమా అంటుందని ప్రకటించారు. నేడు సాగర్ చంద్ర పుట్టిన రోజు కావడంతో చిత్రయూనిట్ తనకు విషెష్ చెప్తూ పోస్టర్ రిలీజ్ చేయడంతో సాగర్ నెక్స్ట్ సినిమాపై అందరికి మరోసారి క్లారిటీ వచ్చింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాణంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సాగర్ K చంద్ర దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుంది. ఇది శ్రీనివాస్ కి 10వ సినిమా కావడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. త్వరలోనే షూట్ కు వెళ్లనుంది.
PKSDT : పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?
ఇక బెల్లంకొండ శ్రీనివాస్ ఇటీవలే ఛత్రపతి హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. కాని ఆ సినిమా భారీ పరాజయం చూసింది. శ్రీనివాస్ అంచనాలను తారుమారు చేసి కనీసం సినిమాకు పెట్టిన బడ్జెట్ లో సగంలో సగం కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. మరి ఫ్లాప్స్ లో ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ తో సాగర్ K చంద్ర ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి.
Wishing our MASSive director @saagar_chandrak a very Happy Birthday ❤️?
Get ready for his MASSive feast on the big screens with #BSS10 ?? @BSaiSreenivas @RaamAchanta #GopiAchanta pic.twitter.com/ZaqUfu7YCy
— 14 Reels Plus (@14ReelsPlus) May 17, 2023