ఉగాది స్పెషల్: రాక్షసుడు ఫస్ట్‌లుక్‌ విడుదల

నిర్మాత బెల్లంకొండ సురేష్ సినీ వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన సాయి శ్రీనివాస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోడానికి ప్రయత్నిస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : April 6, 2019 / 07:01 AM IST
ఉగాది స్పెషల్: రాక్షసుడు ఫస్ట్‌లుక్‌ విడుదల

Updated On : April 6, 2019 / 7:01 AM IST

నిర్మాత బెల్లంకొండ సురేష్ సినీ వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన సాయి శ్రీనివాస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోడానికి ప్రయత్నిస్తున్నారు.

నిర్మాత బెల్లంకొండ సురేష్ సినీ వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన సాయి శ్రీనివాస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా.. వరుసగా చిత్రాలను చేస్తున్నాడు ఈ యువహీరో‌. తాజాగా కవచం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఈ హీరో.. సీత చిత్రంలో త్వరలోనే మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. ఈ హీరో ఓ రీమేక్‌ చిత్రంలో కూడా నటించనున్నాడన్న సంగతి తెలిసిందే.
Read Also : మహేష్ ప్రాబ్లం ఏంటంటే: మహర్షి టీజర్ చూశారా?

కోలీవుడ్‌ హిట్‌ మూవీ రాక్షసన్‌ను.. తెలుగులో రాక్షసుడుగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను ఉగాది స్పెషల్ గా రిలీజ్ చేసింది చిత్రయూనిట్‌. ఈ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. సైకో కిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అనుపమా పరమేశ్వరణ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. రైడ్‌, వీర ఫేమ్‌ రమేష్‌ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.