Bellamkonda Sreenivas Bollywood Chatrapathi Remake review
Chatrapathi Remake : రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా 2005లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ‘ఛత్రపతి’. మదర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ చిత్రం ప్రభాస్ కి మాస్ హీరో ఇమేజ్ ని తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఈ సినిమాతో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ రీమేక్ ని టాలీవుడ్ డైరెక్టర్ వి వి వినాయక్ తెరకెక్కిస్తున్నాడు. తెలుగు ఆడియన్స్ కి బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేసింది కూడా వినాయకే.
Bellamkonda Sreenivas : బాలీవుడ్ పై బెల్లంకొండ ప్రశంసలు.. ప్రతి నటుడికి హిందీ సినిమానే ఏకైక మార్గం..
కాగా శ్రీనివాస్ కి హిందీ బెల్ట్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. తను నటించిన తెలుగు సినిమాలన్నీ యూట్యూబ్ లో డబ్ అయ్యి అదిరిపోయే వ్యూస్ సంపాదిస్తుంటాయి. దీంతో బాలీవుడ్ ఎంట్రీకి ముందే శ్రీనివాస్ అక్కడ మంచి ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక నేడు (మే 12) రిలీజ్ అయిన ఈ ఛత్రపతి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ ఆడియన్స్ నుంచి బెల్లకొండ యాక్టింగ్ కి అయితే మంచి మార్కులే పడ్డాయి. అయితే ఒరిజినల్ ఛత్రపతి 2005లో వచ్చిన సినిమా కావడం, ఇప్పుడు ఆ కథ అవుట్ డేటెడ్ అయ్యిపోయింది అని టాక్ వినిపిస్తుంది.
Bellamkonda Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో ఆల్రెడీ బిగ్ మాస్ హీరో.. రాజమౌళి!
సినిమా కథ విషయంలో దర్శకుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాక్స్ ఆఫీస్ వద్ద రిజల్ట్ మరోలా ఉండేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. యాక్షన్ సన్నివేశాలు బాగా తెరకెక్కించారని కామెంట్స్ వినబడుతున్నాయి. హీరోయిన్ ని మాత్రం కేవలం కొన్ని సీన్స్ అండ్ సాంగ్స్ కి మాత్రమే పరిమితం చేశారని, రవి బస్రూర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ కొంచెం ఇబ్బంది పెట్టిందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతానికి మిక్స్డ్ టాక్ తో రన్ అవుతున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద చివరికి హిట్టుగా నిలుస్తుందా? లేదా ప్లాప్ గా నిలుస్తుందా? అంటే ఫస్ట్ వీకెండ్ పూర్తి కావాల్సిందే.