Bellamkonda Sreenivas : బాలీవుడ్ పై బెల్లంకొండ ప్రశంసలు.. ప్రతి నటుడికి హిందీ సినిమానే ఏకైక మార్గం..

ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్.. హిందీ సినిమాలో నటించాలనేది ప్రతి ఒక్క నటుడి కల అంటూ వ్యాఖ్యానించాడు.

Bellamkonda Sreenivas : బాలీవుడ్ పై బెల్లంకొండ ప్రశంసలు.. ప్రతి నటుడికి హిందీ సినిమానే ఏకైక మార్గం..

Bellamkonda Sreenivas viral comments on bollywood movies

Updated On : May 12, 2023 / 2:01 PM IST

Bellamkonda Sreenivas : టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. రాజమౌళి, ప్రభాస్ (Prabhas) కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ లో సూపర్ హిట్టుగా నిలిచిన విషయం తెలిసిందే. హిందీలో ఈ సినిమాని వి వి వినాయక్ డైరెక్ట్ చేస్తున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ ని తెలుగు ఆడియన్స్ కి హీరోగా పరిచయం చేసింది కూడా వినాయకే. ఈ హీరోకి హిందీ బెల్ట్ మంచి ఫాలోయింగ్ ఉంది. శ్రీనివాస్ నటించిన తెలుగు సినిమాలన్నీ యూట్యూబ్ లో డబ్ అయ్యి రిలీజ్ అవుతుంటాయి.

Bellamkonda Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో ఆల్రెడీ బిగ్ మాస్ హీరో.. రాజమౌళి!

ఆ డబ్బింగ్ సినిమాలు ద్వారా బాలీవుడ్ ఎంట్రీకి ముందే మంచి ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక నేడు (మే 12) రిలీజ్ అయిన ఛత్రపతి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. తెలుగు ఈ సినిమా 2005 లో రిలీజ్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఆ కథ అవుట్ డేటెడ్ అయ్యిపోయింది అని టాక్ వినిపిస్తుంది. సినిమాలో బెల్లకొండ యాక్టింగ్ కి అయితే మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ లో పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న శ్రీనివాస్.. బాలీవుడ్ ని ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Bellamkonda Srinivas : బాలీవుడ్ లో చరణ్, ఎన్టీఆర్ పేర్లను వాడేసుకుంటున్న బెల్లంకొండ శ్రీనివాస్

బెల్లంకొండ శ్రీనివాస్.. “ఇక్కడ డబ్ అయిన నా తెలుగు సినిమాలు ఎన్నో వ్యూస్ సంపాదించడం నాకు చాలా ఆనందంగా ఉంది. హిందీ ఆడియన్స్ నా పై చూపిస్తున్న అభిమానానికి నేను థాంక్యూ చెప్పాలి అనుకున్నాను. అది కూడా ఒక గొప్ప సినిమాతో వాళ్ళకి థాంక్యూ చెప్పాలి అనుకున్నాను. ఆ క్రమంలోనే ఛత్రపతిని రీమేక్ చేశాం. మూవీ టీం మొత్తం చాలా కష్టపడ్డాం. హిందీ సినిమాలో నటించాలనేది ప్రతి ఒక్క నటుడి కల. ఎందుకంటే దేశంలోని ప్రతి ప్రాంతానికి చేరాలి అంటే హిందీ సినిమానే ఏకైక మార్గం” అంటూ చెప్పుకొచ్చాడు.