Chatrapathi Remake : బెల్లంకొండ శ్రీనివాస్ ‘ఛత్రపతి’ అఫీషియల్ టీజర్ వచ్చేసింది..

బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) బాలీవుడ్ డెబ్యూట్ ఇవ్వబోతున్న సినిమా ఛత్రపతి (Chatrapathi) రీమేక్. ఈ మూవీ అఫీషియల్ టీజర్ ని శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ చేశారు.

Bellamkonda Sreenivas Chatrapathi Remake Official Teaser Released

Chatrapathi Remake : టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) ఛత్రపతి (Chatrapathi) రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ (Prabhas) హీరోగా రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు హిందీలో ఈ చిత్రాన్ని వి వి వినాయక్ డైరెక్ట్ చేస్తున్నాడు. 2021లో మొదలైన ఈ రీమేక్ ఓపెనింగ్ కి రాజమౌళి హాజరయ్యి శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ (Pen Studios) ఈ సినిమాని నిర్మిస్తుంది.

Bellamkonda Sreenivas : పవన్ కళ్యాణ్ డైరెక్టర్‌తో బెల్లంకొండ కొత్త సినిమా..

శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా టీజర్ ని ఇవాళ రిలీజ్ చేద్దాం అని అనుకున్నారు మేకర్స్. కానీ అఫిషియల్ రిలీజ్ కంటే ముందే ఈ మూవీ టీజర్ లీక్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో లీక్ అయిన టీజర్ చూసిన తెలుగు ఆడియన్స్ రీమేక్ కి మంచి మార్కులే వేశారు. తాజాగా ఈ మూవీ అఫీషియల్ టీజర్ ని రిలీజ్ చేశారు. నిమిషం పాటు ఉన్న టీజర్ ని ఫుల్ యాక్షన్ సీన్స్ తో కట్ చేశారు. వినాయక్ మాస్ టేకింగ్ జత చేసి ఛత్రపతిని మళ్ళీ రీ క్రియేట్ చేసిన ఫీలింగ్ కలిగింది టీజర్ చూస్తుంటే.

Jaya Janaki Nayaka : ‘జయ జానకి నాయక’ సినిమాతో వరల్డ్ రికార్డు సృష్టించిన హీరో బెల్లంకొండ..

బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ప్రభాస్ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు అంటున్నారు తెలుగు ప్రేక్షకులు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నుష్రత్ బరుచా (Nushrratt Bharuccha) నటిస్తుంది. తనిష్క్ బాఘ్చి సంగీతం అందిస్తుండగా.. కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. సమ్మర్ కానుకగా మే 12న ఈ సినిమా బాలీవుడ్ ఆడియన్స్ ని పలకరించబోతుంది. అల్లుడు శీను సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ కి టాలీవుడ్ లోకి మంచి డెబ్యూట్ అందించిన వినాయక్.. ఇప్పుడు ఛత్రపతితో బాలీవుడ్ లోకి కూడా శ్రీనివాస్ కి మంచి డెబ్యూట్ అందిస్తాడా? లేదా? చూడాలి.