Bellamkonda Sreenivas : మనోజ్.. మోహన్ బాబు ఇంట్లోనే ఉండేవాడు.. కానీ.. ‘భైరవం’కు వరుస వివాదాలు.. స్పందించిన బెల్లంకొండ శ్రీనివాస్..

గత కొన్ని రోజులుగా భైరవం సినిమా చుట్టూ వివాదాలు నడుస్తున్నాయి.

Bellamkonda Sreenivas Reacts on Bhairavam and Manchu Manoj Issues

Bellamkonda Sreenivas : హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కొంచెం గ్యాప్ తర్వాత మంచు మనోజ్, నారా రోహిత్ తో కలిసి భైరవం అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా మే 30న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా నేడు మీడియాతో ముచ్చటించాడు శ్రీనివాస్.

అయితే గత కొన్ని రోజులుగా భైరవం సినిమా చుట్టూ వివాదాలు నడుస్తున్నాయి. వైసీపీకి చెందిన వ్యక్తులు భైరవం సినిమాని బాయ్ కాట్ చేయమని ట్వీట్స్ చేయడం, ఎప్పుడూ వివాదాల్లో లేని బెల్లంకొండ శ్రీనివాస్ ఇటీవల రాంగ్ రూట్ లో వచ్చి కానిస్టేబుల్ తో గొడవపడి వివాదంలో నిలవడం, ఇక మంచు మనోజ్ – మంచు ఫ్యామిలీ గొడవలతో రెగ్యులర్ గా వార్తల్లో ఉండటం, భైరవం డైరెక్టర్ పై ఒక హీరో ఫ్యాన్స్ విమర్శలు చేయడం.. ఇలా ఈ సినిమా చుట్టూ వివాదాలు ఉన్నాయి.

Also Read : Movie Theaters : థియేటర్స్ బంద్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన ఫిలిం ఛాంబర్..

నేడు మీడియాతో మాట్లాడుతూ బెల్లంకొండ శ్రీనివాస్ ఈ వివాదాలపై స్పందించాడు. శ్రీనివాస్ మాట్లాడుతూ.. వివాదాలు మంచివే. సినిమాకు ప్రమోషన్ కింద కూడా ఉపయోగపడుతున్నాయి. అసలు ఎప్పుడూ వివాదాల్లోకి వెళ్లని నాకు కూడా అలా జరిగింది. మనోజ్ కి కూడా సినిమా షూటింగ్ మధ్యలో నుంచే వాళ్ళ ఫ్యామిలీ వివాదాలు వచ్చాయి. భైరవం షూటింగ్ మొదలయినప్పుడు మనోజ్.. మోహన్ బాబు ఇంట్లోనే ఉండేవాడు. వాళ్ళింటి నుంచి క్యారేజ్ కూడా వచ్చేది. కానీ ఆ తర్వాత ఇలా జరిగింది అని అన్నారు. మిగతా వివాదాల గురించి స్పందించకుండా వాటి వల్ల కూడా సినిమా వైరల్ అవుతుంది అని అన్నారు.

Also Read : Mukul Dev : సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. ‘కృష్ణ’ విలన్‌ కన్నుమూత