Movie Theaters : థియేటర్స్ బంద్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన ఫిలిం ఛాంబర్..
థియేటర్ బిజినెస్ లోని అన్ని సెక్టార్లతో నేడు ఫిలిం ఛాంబర్ లో మీటింగ్ జరిగింది.

Film Chamber Gives Clarity on Movie Theaters Bundh
Movie Theaters : గత కొన్ని రోజులుగా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మధ్య థియేటర్స్ పర్శంటేజ్ విధానం కోసం చర్చలు, వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆల్రెడీ థియేటర్స్ బంద్ లేదని ఓ రెండు రోజుల ముందే పలువురు డిస్ట్రిబ్యూటర్స్ ప్రకటించారు. తాజాగా నేడు థియేటర్స్ సమస్యలపై ఫిలిం ఛాంబర్ లో మీటింగ్ జరిగింది.
Also Read : Mukul Dev : సినీ పరిశ్రమలో విషాదం.. ‘కృష్ణ’ విలన్ కన్నుమూత
థియేటర్ బిజినెస్ లోని అన్ని సెక్టార్లతో నేడు ఫిలిం ఛాంబర్ లో మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ అనంతరం థియేటర్ల మూసివేత నిర్ణయం వాయిదా వేసినట్టు క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ నెల 30న ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో అన్ని సెక్టార్స్ ని పరిగణనలోకి తీసుకుని ఈ సమస్య పై ఒక కమిటీ వేస్తాము అని, ఆ కమిటీ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తుందని తెలిపింది ఫిలిం ఛాంబర్.
అలాగే.. నేడు ఫిలిం ఛాంబర్ లో రెండు తెలుగు రాష్ట్రాల నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు. ప్రస్తుతం థియేటర్ల పరిస్థితిపై ఉన్న కొన్ని సమస్యల గురించి చర్చలు జరగాయి. ఈనెల 30వ తేదీన ఈసీ మీటింగ్ ఉండబోతుంది. ఆరోజు మూడు సెక్టార్లకు నుండి ఒక కమిటీ నిర్మించబోతున్నాము. ఓ నిర్ణీత సమయంలోనే ఈ సమస్యకు పరిష్కారం వచ్చేలా ఆ కమిటీ పని చేయబోతుంది. అబద్ధపు వార్తలు చిత్ర పరిశ్రమలో అనవసరమైన ఆటంకాలు తీసుకొస్తున్నాయి. ఈ విషయంపై అవసరమైతే ప్రభుత్వంతో కూడా మాట్లాడతాము. ఏదో ఒక సినిమాను టార్గెట్ చేసి థియేటర్లు బంద్ చేస్తున్నారు అనే వార్తను పూర్తిగా ఖండిస్తున్నాము అని అన్నారు.
Also Read : Adivi Sesh : వామ్మో అడివి శేష్ సినిమాకు.. మ్యూజిక్ రైట్స్ కి అన్ని కోట్లా?
ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్, శ్రీధర్, సుధాకర్ రెడ్డి, శివ ప్రసాద్ రావు, కేల్ దామోదర్ ప్రసాద్, భరత్ భూషణ్, వెంకటేశ్వరరావు, సునీల్ నారంగ్, అనుపం రెడ్డి, భరత్ చౌదరి, టి ఎస్ రాంప్రసాద్, సి కళ్యాణ్, ముత్యాల రామదాస్, ఎం సుధాకర్.. పలువురు పాల్గొన్నారు.