Adivi Sesh : వామ్మో అడివి శేష్ సినిమాకు.. మ్యూజిక్ రైట్స్ కి అన్ని కోట్లా?

ప్రస్తుతం డెకాయిట్, గూఢచారి 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు శేష్.

Adivi Sesh : వామ్మో అడివి శేష్ సినిమాకు.. మ్యూజిక్ రైట్స్ కి అన్ని కోట్లా?

Adivi Sesh Dacoit Movie Music Rights sold with Huge Price

Updated On : May 24, 2025 / 4:11 PM IST

Adivi Sesh : తక్కువ బడ్జెట్ లో అదిరిపోయే థ్రిల్లింగ్ సినిమాలు తీస్తూ వరుస హిట్స్ కొడుతూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు అడివి శేష్. టాలీవుడ్ లో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారాడు శేష్. మేజర్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ కూడా సంపాదించుకున్నాడు. ప్రస్తుతం డెకాయిట్, గూఢచారి 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు శేష్.

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా డెకాయిట్ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం డెకాయిట్ సినిమా మ్యూజిక్ రైట్స్ ని సోనీ మ్యూజిక్ కంపెనీ ఏకంగా 8 కోట్లకు కొనుక్కుందట. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు. 8 కోట్లకు మ్యూజిక్ రైట్స్ అనేది శేష్ కెరీర్ లోనే భారీ డీలింగ్.

Also Read : Bellamkonda Sreenivas : పూరి జగన్నాధ్ తో బెల్లంకొండ సినిమా.. ఆల్రెడీ కలిసాను అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ కామెంట్స్..

ఇక డెకాయిట్ సినిమాని తెలుగు, హిందీలో రిలీజ్ చేయనున్నారు. ఈ డీలింగ్ తో అడివి శేష్ మార్కెట్ కూడా భారీగా పెరిగిందని భావిస్తున్నారు. కేవలం మ్యూజిక్ కే 8 కోట్లు అంటే ఓటీటీ, థియేటర్ రైట్స్ అయితే భారీగా అమ్ముడుపోతాయని తెలుస్తుంది.