Bellamkonda Sreenivas : పూరి జగన్నాధ్ తో బెల్లంకొండ సినిమా.. ఆల్రెడీ కలిసాను అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ కామెంట్స్..

ప్రమోషన్స్ లో భాగంగా బెల్లంకొండ శ్రీనివాస్ నేడు మీడియాతో మాట్లాడాడు.

Bellamkonda Sreenivas : పూరి జగన్నాధ్ తో బెల్లంకొండ సినిమా.. ఆల్రెడీ కలిసాను అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ కామెంట్స్..

Bellamkonda Sreenivas Planning Movie with Puri Jagannadh

Updated On : May 24, 2025 / 3:55 PM IST

Bellamkonda Sreenivas : గత కొన్నాళ్ళుగా గ్యాప్ తీసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు వరుస సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు మే 30న భైరవం అనే సినిమాతో రాబోతున్నాడు. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ముగ్గురు హీరోలు కలిసి నటించిన సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బెల్లంకొండ శ్రీనివాస్ నేడు మీడియాతో మాట్లాడాడు.

ఈ క్రమంలో బెల్లంకొండ శ్రీనివాస్ భైరవం తర్వాత, కిష్కింధపురి, హైందవం, టైసన్ నాయుడు సినిమాలు ఉన్నాయని తెలిపాడు. అలాగే.. పూరి జగన్నాధ్ గారిని ఒకటి రెండు సార్లు కలిసాను. కథ డిస్కషన్స్ జరిగాయి. కానీ వర్కౌట్ అవ్వలేదు. తప్పకుండా ఆయనతో సినిమా ఉంటుంది. నాకు ఇంకా 31 ఏళ్ళే. ప్రస్తుతం నేను డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ సినిమాలు చేస్తున్నాను. వాటి తర్వాత ప్లాన్ ఉంటుంది అని తెలిపాడు.

Also Read : Game Changer : వామ్మో.. ‘గేమ్ ఛేంజర్’ సినిమా నిడివి 7 గంటలపైనే.. ఎడిటర్ సంచలన వ్యాఖ్యలు..

దీంతో బెల్లంకొండ శ్రీనివాస్ భవిష్యత్తులో పూరి జగన్నాధ్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. పూరి ప్రస్తుతం తమిళ్ స్టార్ విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయ్యాక బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ఉండొచ్చు అని భావిస్తున్నారు.