Game Changer : వామ్మో.. ‘గేమ్ ఛేంజర్’ సినిమా నిడివి 7 గంటలపైనే.. ఎడిటర్ సంచలన వ్యాఖ్యలు..
తాజాగా గేమ్ ఛేంజర్ సినిమాకు మొదట ఎడిటర్ గా పనిచేసిన షమీర్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసాడు.

Editor Shameer Comments on Ram Charan Game Changer Movie Original length
Game Changer : డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో భారీగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా గత సంక్రాంతికి రిలీజయి కమర్షియల్ గా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే సినిమా యావరేజ్ గా ఉన్నా వేరే హీరోల అభిమానులు, పలువురు నెటిజన్లు ఈ సినిమాకి నెగిటివ్ ప్రమోషన్స్ చేసి, సినిమా లీక్ చేసి భారీ నష్టాన్ని మిగిల్చారు.
సినిమా ఫ్లాప్ అయ్యాక గేమ్ ఛేంజర్ యూనిట్ నుంచి మాది తప్పు కాదు అన్నట్టు ఎవరో ఒకరు ఏదో వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. డైరెక్టర్ శంకర్ కూడా 5 గంటల సినిమా అది, కొన్ని సీన్స్ కట్ చేయాల్సి వచ్చింది, అవుట్ ఫుట్ తో నేను సంతృప్తిగా లేను అని అన్నారు. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కూడా నేనించ్చిన కథని మొత్తం మార్చేశారు అని అన్నారు. థమన్ కూడా పాటలు ఎప్పుడో చేసేసాను అని, సినిమా లేట్ అయి మ్యూజిక్ ఓల్డ్ అయిపోయిందని అన్నారు. ఇలా ఆ సినిమాకు పనిచేసిన వారు ఏదో ఒక కామెంట్స్ చేస్తూ ఇంకా గేమ్ ఛేంజర్ సినిమాని వార్తల్లో నిలుపుతున్నారు.
Also Read : Hebah Patel : ‘థాంక్యూ డియర్’ అంటున్న హెబ్బా పటేల్..
తాజాగా ఆ సినిమాకు మొదట ఎడిటర్ గా పనిచేసిన షమీర్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసాడు. షమీర్ మాట్లాడుతూ.. నేను కూడా గేమ్ ఛేంజర్ సినిమాకు పని చేశాను. నేను వర్క్ చేసినప్పుడు ఆ సినిమా నిడివి ఏడున్నర గంటలు. దాన్ని నేను మూడు గంటలకు ట్రిమ్ చేశాను. ఆ సినిమా ఏళ్ళ తరబడి సాగడం, నాకు వేరే కమిట్మెంట్స్ ఉండటంతో నేను గేమ్ ఛేంజర్ సినిమా నుంచి తప్పుకున్నాను. ఆ సినిమా నాకు సరైన అనుభూతిని ఇవ్వలేదు అని అన్నాడు. దీంతో షమీర్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
షమీర్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాక గేమ్ ఛేంజర్ సినిమాకు రూబెన్ ఎడిటర్ గా పనిచేసాడు. ఈ సినిమా ఫైనల్ గా 2 గంటల 45 నిమిషాల నిడివితో రిలీజయింది. దీంతో మరి మిగిలిన నాలుగు గంటల పైగా ఫుటేజ్ అంతా ఏమైంది? అంత ఎందుకు షాట్ చేసారు అని ఫ్యాన్స్, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్టు గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కి కూడా ఒక్కొక్కరు ఇలా ఒక్కో కారణం చెప్తున్నారు. ఎవరు ఏం చెప్పినా ఎఫెక్ట్ మాత్రం చరణ్ కే ఎక్కువగా పడింది.