Hebah Patel : ‘థాంక్యూ డియర్’ అంటున్న హెబ్బా పటేల్..
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు.

Hebah Patel Dhansuh Raghumudri Thank You Dear First Look Released by Thammareddy Bharadwaja
Hebah Patel : హెబ్బా పటేల్, ధనుష్ రఘుముద్రి జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘థ్యాంక్యూ డియర్’. మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మాణంలో తోట శ్రీకాంత్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు.
సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా థ్యాంక్యూ డియర్ ఫస్ట్ లుక్ రిలీజయింది. ఈ సందర్భంగా తమ్మారెడ్డి చిత్ర బృందానికి అల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సందర్భంగా హీరో ధనుష్ మాట్లాడుతూ.. థాంక్ యూ డియర్ నా రెండో సినిమా. సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి గారు మా సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా నా కెరీర్‌లో కీలకమైంది అని తెలిపాడు.
Also Read : Movie Theaters : థియేటర్స్ బంద్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన ఫిలిం ఛాంబర్..
నిర్మాత పప్పు బాలాజీ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా ధనుష్‌కు గొప్ప పేరు తెస్తుంది. తమ్మారెడ్డి గారు ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం మాకు ప్రోత్సాహకరంగా ఉంది అని అన్నారు.