Bellamkonda Sreenivas Wedding: ఘనంగా జరిగిన టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి
హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sreenivas Wedding), కావ్య రెడ్డిల వివాహం తిరుమలలో ఘనంగా జరిగింది.
- V Santhosh Kumar
- Updated on- April 30, 2026 / 06:44 AM IST
Bellamkonda Srinivas and Kavya Reddy Wedding Celebrated Grandly in Tirumala
Bellamkonda Sreenivas Wedding: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sreenivas Wedding) కొత్త జీవితాన్ని ప్రారంభించారు. బుధవారం రాత్రి ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి సాక్షిగా కావ్య రెడ్డితో ఆయన వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో శాస్త్రోక్తంగా ఈ వివాహం నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ ఈ కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Krithi Shetty: కిల్లింగ్ లుక్స్ తో కవ్విస్తున్న కృతి శెట్టి.. వైరల్ అవుతున్న క్రేజీ ఫోటోలు
