Site icon 10TV Telugu

Rana : ఈడీ విచార‌ణ‌లో రానా పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం?

Betting app case Questions rain down on Rana in ED investigation

Betting app case Questions rain down on Rana in ED investigation

బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ప్రముఖ నటుడు రానా సోమ‌వారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. దాదాపు మూడు గంటలుగా రానాను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్ర‌మంలో న‌టుడి పై అధికారులు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

* జంగిల్ రమ్మీ అనే యాప్ ను ఎన్నేళ్ళు పాటు కాంట్రాక్టు తీసుకున్నారు ?
*దుబాయ్ బేస్డ్ గా నడుస్తున్న జంగిల్ రమ్మీ నుండి మీకు వచ్చిన నగదు ఎంత?
* గేమింగ్ యాప్, బెట్టింగ్ యాప్ అనేది మీకు తెలిసే ప్రమోట్ చేశారా ?
* ప్రమోట్ చేసినందుకు మీకు పారితోషకం ఇచ్చారా లేక.. కమీషన్ ఇచ్చారా ?

Kandula Durgesh : సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో నిర్మాతల భేటీ.. సమ్మె గురించి మాట్లాడలేదు.. అది వాళ్ళు చూసుకుంటారు..

* ఎన్నేళ్ళు పాటు మీకు జంగిల్ యాప్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు ?
* మీతో పాటు ఇంకా ఎవరెవరు ఈ కాంట్రాక్టు లో ఉన్నారు , అందులో మీరు పొందుపరుచుకున్న అంశాలు ఏంటి ?
* జంగిల్ రమ్మీ యాప్ తో కాంట్రాక్ట్ చేసుకొనే ముందు వాటికి అనుమతులు, GST , టాక్స్, రిజిస్ట్రేషన్లు ఉన్నాయా లేదా అనేది మీరు ఎంక్వైరీ చేశారా ?
* జంగిల్ రమ్మీ యాప్ ను సోషియల్ మీడియా ఫ్లాట్ ఫారం తోపాటు ఇంకా ఎక్కడైనా ప్రచారం చేశారా ?
* జంగిల్ రమ్మీ యాప్ తో మీకు ఎప్పుడు కాంట్రాక్ట్ ముగిసింది ?
* వారి చెల్లించిన చెల్లింపులు మీకు ఏవిధంగా చేరాయి ? డైరెక్ట్ అకౌంట్ లో జమ చేశారా ? బిట్ కాయిన్ రూపం లో చెల్లించారా వంటి ప్ర‌శ్న‌ల‌ను ఈడీ అధికారులు అడిగిన‌ట్లుగా తెలుస్తోంది.

Exit mobile version