Kandula Durgesh : సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో నిర్మాతల భేటీ.. సమ్మె గురించి మాట్లాడలేదు.. అది వాళ్ళు చూసుకుంటారు..
నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీ జరిగింది.

Kandula Durgesh
Kandula Durgesh : ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో నేడు తెలుగు సినిమా నిర్మాతలు భేటీ అయ్యారు. బివిఎస్ఎన్ ప్రసాద్, డివివి దానయ్య, కెఎల్ నారాయణ, భరత్(ఛాంబర్ ప్రెసిడెంట్), నాగవంశీ, యెర్నేని రవిశంకర్, విశ్వప్రసాద్, బన్నీవాసు, స్వప్నదత్, యూవీ వంశీ, చెర్రీ, వివేక్ కూచిభొట్ల, సాహు గారపాటి.. మరికొంతమంది నిర్మాతలు ఈ భేటీలో పాల్గొన్నారు.
నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీ జరిగింది. గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు, ఫిలిం ఫెడరేషన్ సమ్మె నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
Also Read : Mass Jathara : ‘మాస్ జాతర’ టీజర్ వచ్చేసింది.. రైల్వే పోలీస్ గా మాస్ మహారాజ..
మంత్రి దుర్గేష్ తో మీటింగ్ అయిన అనంతరం నిర్మాతలు రవి శంకర్, నాగవంశీ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల గురించి మంత్రి కందుల రమేష్ తో జరిగిన సమవేశంలో చర్చకు రాలేదు. అది ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ చూసుకుంటుంది. చిన్న బడ్జెట్ సినిమాలకు వెసులుబాటు ఇవ్వాలనేది అందరి మాటే. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరాము. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి చర్చ జరిగింది. త్వరలో సీఎం, డిప్యూటీ సీఎంతో అపాయింట్మెంట్ ఏర్పాటు చేస్తామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చినట్టు తెలిపారు.
సినిమాటోగ్రఫీ మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిశ్రమ అభివృద్దిపై సినీ నిర్మాతలు చర్చించారు. ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి సమావేశానికి అపాయింట్ మెంట్ ఇప్పించాలని కోరారు. ఏపీలో సినీ పాలసీ అభివృద్దికి పాలసీ తీసుకురావాలని కోరారు. స్టూడియోల నిర్మాణం, డబ్బింగ్ థియేటర్ల నిర్మాణానికి సంసిద్దత వ్యక్తం చేశారు. పరిశ్రమ ఎదుర్కొనే సమస్యలను, చర్చించాల్సిన అంశాలను ప్రాథమికంగా నా దృష్టికి తెచ్చారు. సినిమా పరిశ్రమను ప్రోత్సహించేందుకు నంది అవార్డులు ఇవ్వాలని కోరారు. ఈ ఏడాది నంది అవార్డులను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నంది అవార్డులు ఏ ప్రాతిపదికన ఇవ్వాలో నిర్మాతల మండలితో చర్చించి రావాలని సూచించాను. నంది అవార్డులు ఎలా ఇస్తే బాగుంటుందో చర్చించి ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించాను. తెలుగు రాష్ట్రాలకు కలసి నంది అవార్డులు ఇచ్చే ప్రతిపాదనలు ఆలోచిస్తున్నాం. సినిమాకు పెట్టిన బడ్జెట్ ప్రాతిపదికగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. త్వరలో సినిమా రంగ అభివృద్దికి ప్రత్యేక పాలసీ తీసుకు రావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలకు ప్రోత్సహించేలా పాలసీ ఉంటుంది. రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి చెందేలా ప్రత్యేక ప్రోత్సాహకాలు పాలసీలో ఉంటాయి. సినీ కార్మికుల ఆందోళన అంశం చర్చకు రాలేదు అని తెలిపారు.