Balakrishna : ఇక నుంచి బాలకృష్ణ ‘నటసింహ’ కాదు.. బాలయ్య బిరుదు మారింది.. ఏంటో తెలుసా?

బాలకృష్ణ తన నటనతో టాలీవుడ్ లో యువరత్న, నటసింహ అనే బిరుదులు సంపాదించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఏకంగా గ్లోబల్ టైటిల్ ని అందుకున్నాడు.

Bhagavanth Kesari Balakrishna titled as Global Lion by his fans

Balakrishna : బాలకృష్ణ నందమూరి తారక రామారావు (NTR) వారసుడిగా తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. అయ్యినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యకే ఇమేజ్ ని ఏర్పరచుకొని ‘యువరత్న’ అనే బిరుదుని సంపాదించుకున్నాడు. చాలా కాలం పాటు తన ఆ బిరుదుతో ఆడియన్స్ ని అలరిస్తూ వచ్చిన బాలయ్య.. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాలతో సింహ గర్జన చేసి ‘నటసింహ’ అనే బిరుదుని సంపాదించుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటి వరకు నందమూరి నటసింహం అని అనిపించుకుంటూ వస్తున్నాడు బాలకృష్ణ.

Prabhas – Ranbir : ప్రభాస్ సినిమాకి 10 వేల టికెట్స్ బుక్ చేసిన రణ్‌బీర్.. ఎవరు కోసమో తెలుసా?

అయితే ఇప్పుడు ఆ బిరుదు మారిపోనుంది. ఈ ఏడాది బాలయ్య పుట్టినరోజున నాడు కొత్త బిరుదుని అభిమానులు బాలయ్యకి ఇవ్వబోతున్నారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే కాదు గ్లోబల్ వైడ్ ‘సింహం’ అనే ట్యాగ్ ని బాలకృష్ణ సొంతం చేసుకున్న విధంగా, దానికి న్యాయం చేసినంత విధంగా మరెవరు చేయలేదు. అందుకనే బాలయ్యకి “గ్లోబల్ లయన్” అనే బిరుదుని అభిమానులు ఇస్తున్నారు. కేవలం నందమూరి అభిమానులు మాత్రమే కాదు టాలీవుడ్ లోని ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ బిరుదుని కాదనలేరు.

Bhola Shankar : చిరు లీక్స్ నుంచి మరో సాంగ్.. భోళా శంకరుడి సంగీత్ పార్టీ..

ప్రస్తుతం హీరోలంతా పాన్ ఇండియా ఇమేజ్ కోసం, గ్లోబల్ ఫేమ్ కోసం కష్టపడుతుంటే.. బాలయ్య గ్లోబల్ ట్యాగ్ ని సొంతం చేసుకొని సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేశాడు. కాగా బాలకృష్ణ ప్రస్తుతం 108వ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) అనే టైటిల్ ని ఖరారు చేశారు. అలాగే ఈ శనివారం (జూన్ 10) బాలకృష్ణ పుట్టినరోజు నాడు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలియజేశాడు. ఆ రోజు మూవీ నుంచి టీజర్ లేదా గ్లింప్స్ వచ్చే అవకాశం ఉంది.