Bhagavanth Kesari : పిల్లలకు ఫ్రీగా స్పెషల్ షోలు వేయనున్న భగవంత్ కేసరి టీం.. ఆ మెసేజ్‌ని ఆడపిల్లలందరికి తెలియచేయాలని..

భగవంత్ కేసరి సినిమా విజయం సాధించడంతో నేడు చిత్రయూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది.

Bhagavanth Kesari Movie Team Planning Free Shows for School Children

Bhagavanth Kesari : అనిల్ రావిపూడి (Anil Ravipudi) ద‌ర్శ‌క‌త్వంలో బాలకృష్ణ (Balakrishna) హీరోగా తెరకెక్కిన సినిమా భగవంత్ కేసరి(Bhagavanth Kesari) దసరా కానుకగా నిన్న గురువారం థియేటర్స్ లో రిలీజయి సందడి చేస్తుంది. బాలయ్య ఎప్పుడూ చూపించే మాస్ కాకుండా ఎమోషన్, మెసేజ్ తో రావడంతో సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. భగవంత్ కేసరి మంచి విజయం అందుకొని మొదటి రోజు ఏకంగా 33 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది.

భగవంత్ కేసరి సినిమా విజయం సాధించడంతో నేడు చిత్రయూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు చెప్పాలని, మహిళలను తక్కువగా చూడొద్దని, ఆడవాళ్ళని ఇంకా బలంగా పెంచాలని చూపించారు. ఇంత మంచి మెసేజ్ ని బాలయ్యతో డైరెక్ట్ గా చెప్పించడంతో అంతా అభినందిస్తున్నారు.

Also Read : Roshan Kanakala : బన్నీతో యాంకర్ సుమ కొడుకు.. పుష్ప 2 షూట్‌లో..

ఈ నేపథ్యంలో సినిమాలోని మంచి మెసేజ్ పిల్లలు అందరికి చేరాలని, ముఖ్యంగా స్కూల్ ఏజ్ ఆడపిల్లలు అందరికి ఈ మెసేజ్ వెళ్లాలని భగవంత్ కేసరి టీం నిర్ణయం తీసుకున్నట్టు, త్వరలో స్కూల్ పిల్లలకు పలు ఫ్రీ షోలు వేయనున్నట్టు, అందరికి ఈ మెసేజ్ చేరేలా చర్యలు తీసుకోబోతున్నట్టు చిత్రయూనిట్ తెలిపారు. దీనిపై పలువురు అభినందిస్తున్నారు. త్వరలోనే స్కూల్ విద్యార్థినులకు భగవంత్ కేసరి సినిమాని ఫ్రీగా చూపించబోతున్నారు.