Roshan Kanakala : బన్నీతో యాంకర్ సుమ కొడుకు.. పుష్ప 2 షూట్‌లో..

తాజాగా సుమ తనయుడు రోషన్ కనకాల, బబుల్ గమ్ చిత్ర డైరెక్టర్, హీరోయిన్. పలువురు అల్లు అర్జున్ ని కలిశారు.

Roshan Kanakala : బన్నీతో యాంకర్ సుమ కొడుకు.. పుష్ప 2 షూట్‌లో..

Suma Kanakala Son Roshan kanakala Meets Allu Arjun in Pushpa 2 Shoot

Updated On : October 20, 2023 / 4:15 PM IST

Roshan Kanakala : యాంకర్ సుమ కనకాల(Suma Kanakala) తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. గతంలో నిర్మల కాన్వెంట్ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు రోషన్. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల సినిమాలతో మెప్పించిన దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ కనకాల ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాకు ‘బబుల్ గమ్’(Bubble Gum) అనే వెరైటీ టైటిల్ ని పెట్టారు. ఇందులో మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.

ఇటీవల బబుల్ గమ్ టీజర్ రిలీజయింది. ఈ సినిమా లవ్ అండ్ రొమాంటిక్ కథతో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా సుమ తనయుడు రోషన్ కనకాల, బబుల్ గమ్ చిత్ర డైరెక్టర్, హీరోయిన్. పలువురు అల్లు అర్జున్ ని కలిశారు. అల్లు అర్జున్ ఇటీవల పుష్ప సినిమాకు గాను నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

Also Read : NKR21 Pooja Ceremony : నందమూరి కళ్యాణ్ రామ్ సర్‌ప్రైజ్.. NKR21 లో విజయశాంతి.. కొత్త సినిమా ఓపెనింగ్..

పుష్ప 2 షూటింగ్ సెట్స్ లో గురువారం రాత్రి రోషన్, బబుల్ గమ్ చిత్రయూనిట్ బన్నీని కలిసి అభినందనలు తెలిపారు. బన్నీ కూడా చిత్రయూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. దీంతో బన్నీతో సుమ తనయుడు దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.