Bhagyashree Borse made interesting comments about hero Rana at the Kantha movie trailer release event.
Bhagyashri Borse: మళయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ “కాంతా”. పీరియాడిక్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు సెల్వరాజ్ తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా(Bhagyashri Borse) నటిస్తుండగా.. సముద్రఖని, రానా కీ రోల్స్ ప్లే చేశారు. వినూత్న కాన్సెప్ట్ అండ్ అప్పోర్చ్ తో వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే సాంగ్స్ అండ్ టీజర్ విడుదలై మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. తాజాగా కాంతా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.
Thiruveer: సలార్ లో నేను చేయాల్సింది.. కింగ్డమ్ కూడా మిస్ అయ్యింది.. కానీ, జీవితం ఎలా ఉంటుందంటే..
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంతా టీం పాల్గొన్నారు. అలాగే ట్రైలర్ రిలీస్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సంధర్బంగా భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ హీరో రానాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. “కాంతా సినిమా నాకు చాలా ప్రత్యకం. ఆడియన్స్ కి కూడా కొత్త ఫీలింగ్ ఇస్తుంది. ఇలాంటి సినిమాలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నిజానికి, నేను రానాకి నచ్చలేదు. చూడటానికి ఒకే కానీ యాక్టింగ్ పరంగా ఏమో అని అన్నాడు. కానీ, దర్శకుడు నాపై నమ్మకం ఉంచాడు. లుక్ టెస్ట్, ఆడిషన్స్, డైలాగ్స్ చెప్పిన తరువాతే సినిమాలో ఒకే చేశాడు” అంటూ చెప్పుకొచ్చింది.
దానికి రానా రియాక్ట్ అవుతూ, ప్రతీసారి నేను ఎందుకు విలన్ అవుతాను అని నవ్వుతూ అన్నాడు. దీంతో భాగ్యశ్రీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కాంతా రిలీజ్ డేట్ విషయానికి వస్తే, ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.సరికొత్త కథ, కథనాలతో వస్తున్న ఈ సినిమా ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది అని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు.