Thiruveer: సలార్ లో నేను చేయాల్సింది.. కింగ్డమ్ కూడా మిస్ అయ్యింది.. కానీ, జీవితం ఎలా ఉంటుందంటే..
తిరువీర్.. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కుబాగా వినిపిస్తున్న పేరు. (Thiruveer)"మసూద" సినిమాతో లైం లైట్ లోకి వచ్చిన ఈ నటుడు ఆడియన్స్ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.
Thiruveer makes emotional comments about the opportunity he got in the films Salar and Kingdom
Thiruveer: తిరువీర్.. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కుబాగా వినిపిస్తున్న పేరు. “మసూద” సినిమాతో లైం లైట్ లోకి వచ్చిన ఈ నటుడు ఆడియన్స్ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. జార్జ్ రెడ్డి, పలాస, పరేషాన్ లాంటి సినిమాల్లో మంచి మంచి (Thiruveer)పాత్రలు చేశాడు. ఇక నాని హీరోగా వచ్చిన టక్ జగదీశ్ సినిమాలో నెగిటీవ్ రోల్ లో కనిపించి మెప్పించాడు. కెరీర్ మొదటి నుంచి కూడా విభిన్నమైన పాత్రలు చేస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ నటుడు తాజాగా చేస్తున్న సినిమా “ప్రీ వెడ్డింగ్ షో”.
ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నటుడు తిరువీర్ తనకు వచ్చిన, వదులుకున్న సినిమా అవకాశాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ సంధర్బంగా తిరువీర్ మాట్లాడుతూ.. కెరీర్ స్టార్టింగ్ లోనే పెద్ద పెద్ద అవకాశాలు వచ్చాయి. కానీ, చేయడం కుదరలేదు. వాటిలో ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ ఒకటి. ఈ సినిమాలో కాటేరమ్మ ఫైట్ లో కనిపించే విష్ణు పాత్ర నేను చేయాల్సింది. ఆ పాత్ర కోసం నన్ను సంప్రదించారు. కానీ, ఏమైందో ఆ పాత్ర మిస్ అయ్యింది. ఆలాగే రీసెంట్ గా విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన కింగ్డమ్ సినిమాలో కూడా మంచి అవకాశం వచ్చింది. అది కూడా మెయిన్ విలన్ గా. తరువాత ఆ పాత్ర వేంకటేశన్ చేశాడు.
ఈ రెండు పాత్రలు నేనే చేయాల్సింది. కానీ, మిస్ అయ్యాయి. ఆ పాత్రలు నేను చేసిన కూడా అంతే ఇంపాక్ట్ ఉండేవి. మిస్ అయినందుకు చాలా బాధేసింది. జీవితంలో మనం అనుకున్నవి అన్ని జరుగవు కదా అని అనుకున్నాను. ప్రస్తుతం కూడా మంచి మంచి సినిమా చేస్తున్నాను. అవి నాకు కొత్త దారులను చూపిస్తున్నాయి”అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో నటుడు తిరువీర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
