Allu Arjun: అల్లు అర్జున్ తో భారీ సినిమా.. పక్కా ప్లాన్ చేస్తున్న సంజయ్ లీలా బన్సాలి.. బడ్జెట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
పుష్ప 2 సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ (Allu Arjun)తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.
Star Director Sanjay leela bhansali planning a movie with allu arjun
Allu Arjun: పుష్ప 2 సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. అందుకే, తన నెక్స్ట్ సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా (Allu Arjun)రూ.800 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు టాక్. అవతార్, ఎవెంజర్స్ లాంటి సినిమాలకు వర్క్ చేసిన హాలీవుడ్ స్టూడియోలు ఈ సినిమా కోసం వర్క్ చేస్తుండటంతో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.
Bro 2: బ్రో 2 రెడీ.. సార్ డేట్స్ కోసం వెయిటింగ్.. షాకిచ్చిన దర్శకుడు..
ఇదిలా ఉంటే, గత రెండు రోజుల నుంచి బాలీవుడ్ అండ్ టాలీవుడ్ వర్గాల్లో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే, అట్లీ సినిమా తరువాత అల్లు అర్జున్ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలితో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. సంజయ్ లీలా బన్సాలి అంటే బాలీవుడ్ లో భారీ సినిమాలకు కేరాఫ్. సావరియా, రామ్ లీలా, బాజీరావు మస్తానీ, పద్మవత్, గంగూభాయ్ లాంటి గొప్ప గొప్ప సినిమాలు చేశాడు ఆయన. అలాంటి దర్శకుడు ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ముందుకు వస్తున్నాడట.
ఈ ప్రాజెక్టుకి సంబందించిన కథా చర్చలు కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయని టాక్ నడుస్తోంది. సంజయ్ లీలా బన్సాలి గత చిత్రాల లాగానే ఈ సినిమాను కూడా భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారని సమాచారం. పీరియాడికల్ బ్యాక్డ్రాప్ లో ఇంటర్నేషనల్ లెవల్లో రానున్న ఈ సినిమా కోసందాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ ను కేటాయించనున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది. ఇక ఈ సినిమా గనుక హిట్ అయితే అల్లు అర్జున్ రేంజ్ నెక్స్ట్ లెవల్ కి చేరడం ఖాయం.
