Bharadwaja Thammareddy: టాలీవుడ్ నిర్మాతలు, కార్మికుల మధ్య నెలకొన్న వివాదంపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. వేతన వివాదంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ సమస్య అయినా త్వరలో సాల్వ్ అయిపోతుందన్నారు. నిర్మాతల నాలుగు ప్రపోజల్స్ మీద చర్చ జరిగిందన్నారు.
డైలీ వేజ్ తీసుకునే వారు నెలకు ఎన్ని రోజులు వర్క్ చేస్తారనేది ముఖ్యం అన్నారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లతో సినీ కార్మికులకు పోలిక అనవసరం అని తేల్చి చెప్పారు. అల్టిమేట్ గా అందరికీ పని దొరకాలని తమ్మారెడ్డి భరద్వాజ ఆకాంక్షించారు. పైగా వేతన వివాదం ఫస్ట్ టైమ్ కాదని ఆయన గుర్తు చేశారు. అటు నిర్మాతలు, ఇటు కార్మికులు.. ఇద్దరూ తగ్గి సమస్య సాల్వ్ చేసుకోవాలని ఆయన సూచించారు. అలా అవుతుందన్న నమ్మకం తనకుందన్నారు.
తెలుగు ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రావడం లేదు. చర్చలు విఫలం కావడంతో సినీ కార్మికుల బంద్ కొనసాగుతోంది. వేతనాలు పెంచే వరకు తగ్గేదే లేదని కార్మికులు అంటున్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాతలు, కార్మికుల మధ్య వేతనాల పెంపు వివాదం మరింత ముదురుతోంది. 30శాతం వేతనాలు కచ్చితంగా పెంచాలనే పట్టుదలతో కార్మికులు ఉండగా, ఈ విషయంలో అస్సలు తగ్గేదేలే అని నిర్మాతలు అంటున్నారు.