అరవింద్ స్వామి ‘భాస్కర్ ఒరు రాస్కల్’ తెలుగులో..

అరవిందస్వామి, అమలాపాల్ జంటగా నటించిన యాక్షన్ కామెడీ ఫిలిం.. ‘భాస్కర్ ఒరు రాస్కల్’.. తెలుగులో ‘భాస్కర్ ఒక రాస్కల్’ పేరుతో విడుదల కానుంది..

  • Published By: sekhar ,Published On : October 31, 2019 / 09:13 AM IST
అరవింద్ స్వామి ‘భాస్కర్ ఒరు రాస్కల్’ తెలుగులో..

Updated On : October 31, 2019 / 9:13 AM IST

అరవిందస్వామి, అమలాపాల్ జంటగా నటించిన యాక్షన్ కామెడీ ఫిలిం.. ‘భాస్కర్ ఒరు రాస్కల్’.. తెలుగులో ‘భాస్కర్ ఒక రాస్కల్’ పేరుతో విడుదల కానుంది..

అరవిందస్వామి, అమలాపాల్ జంటగా తమిళ్‌లో.. సిద్ధికీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ఫిలిం.. ‘భాస్కర్ ఒరు రాస్కల్’.. బేబి నైనిక, మాస్టర్ రాఘవన్ వారి పిల్లలుగా నటించగా.. నికిషా పటేల్, అఫ్తాబ్ శివదాసాని ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. సూర్య, రోబో శంకర్‌ల కామెడీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఇప్పడు తెలుగులో ‘భాస్కర్ ఒక రాస్కల్’ పేరుతో రిలీజ్ కాబోతోంది. కార్తికేయ మూవీస్ పతాకంపై పఠాన్ చాన్ బాషా తెలుగులో డబ్ చేయనున్నారు. నవంబర్ నెలలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్మాత పఠాన్ చాన్ బాషా మాట్లాడుతూ.. ‘దర్శకుడు సిద్ధికీ ఇదే చిత్రాన్ని మొదట మలయాళంలో మెగాస్టార్ మమ్ముట్టి, నయనతార జంటగా రూపొందించారు. అక్కడ మంచి విజయం సాధించడంతో.. సిద్ధికీ మళ్లీ తన దర్శకత్వంలోనే  తమిళంలో తెరకెక్కించారు. తమిళంలో కూడా ఈ చిత్రానికి ప్రేక్షక ఆదరణ లభించడంతో తెలుగులో విడుదల చేయాలనుకున్నాను. తోడు లేని ఇద్దరు వ్యక్తులు ఎలా కలిశారు. వారు అలా కలిసేందుకు ఇద్దరు పిల్లలు ఎలాంటి ప్రయత్నం చేసారు అనే ఆసక్తికరమైన కథాంశంతో ఆద్యంతం హాస్య ప్రధానంగా ఈ చిత్రం ఉంటుంది.

Read Also : దర్శకుడు భారతీ రాజా ఇంట్లో చోరీ : నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు

‘అలాగే ఊహించని ఓ ట్విస్ట్ ప్రేక్షకులను ఎంతగానో అలరింపజేస్తుంది. సీనియర్ నటి మీనా కుమార్తె బేబీ నైనిక ఈ చిత్రంలో ఓ ప్రధాన భూమిక పోషించింది. అరవిందస్వామి, అమలాపాల్ తమ పాత్రలలో అద్భుతమైన నటనను కనబరిచారు. అమ్రిష్ గణేష్ సమకూర్చిన సంగీతం ఆకట్టుకుంటుంది. నవంబర్ రెండో వారంలో ఆడియోను, ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహిస్తాం. అదే నెలలో సినిమాను విడుదల చేస్తాం’.. అని చెప్పారు. సినిమాటోగ్రఫీ : విజయ్ ఉలగనాధ్, ఎడిటింగ్ : కరుణాకరన్.