Pawan Kalyan : ‘భవదీయుడు భగత్ సింగ్’ నుంచి క్రేజీ అప్‌డేట్.. పవన్‌ని కలిసిన హరీష్ శంకర్..

ఇటీవల హరీష్ శంకర్ ఈ సినిమా గురించి వాయిస్ ఓవర్ తో ఓ ట్వీట్ చేసి త్వరలో ‘భవదీయుడు భగత్ సింగ్’ నుంచి అప్డేట్ వస్తుంది అని చెప్పారు. తాజాగా పవన్ కళ్యాణ్ ని హరీష్ శంకర్.........

Hareesh Shankar (1)

Bhavadeeyudu Bhagath Singh :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ‘గబ్బర్ సింగ్’ సినిమా. ఈ సినిమా పవన్ అభిమానులకు కొత్త ఊపునిచ్చింది. పవన్ ని ఎలా చూడాలి అనుకున్నారో ఆయన అభిమానులకు డైరెక్టర్ హరీష్ శంకర్ అలా చూపించారు. ఈ సినిమా తర్వాత పవన్ రేంజ్ అమాంతం పెరిగింది. దీనికి ఒక రకంగా కారణం హరీష్ శంకర్ కూడా.

ఇక ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మళ్ళీ సినిమా వస్తే బాగుండు అని పవన్ అభిమానులు అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇటీవల పవన్ వరుస సినిమాలు అనౌన్స్ చేయడంతో హరీష్ శంకర్ తో కూడా సినిమా అనౌన్స్ చేశారు. దీంతో పవన్ అభిమానులు సంబరపడిపోయారు. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Vaishnav Tej : సమ్మర్‌కి గ్రాండ్ ముగింపు ఇవ్వనున్న వైష్ణవ్ తేజ్.. ‘రంగరంగ వైభవంగా’ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ‘భవదీయుడు భగత్ సింగ్’ అని అనౌన్స్ చేశారు. ఇటీవల హరీష్ శంకర్ ఈ సినిమా గురించి వాయిస్ ఓవర్ తో ఓ ట్వీట్ చేసి త్వరలో ‘భవదీయుడు భగత్ సింగ్’ నుంచి అప్డేట్ వస్తుంది అని చెప్పారు. తాజాగా పవన్ కళ్యాణ్ ని హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని కలిశారు.

Allu Arjun : తగ్గని పుష్ప క్రేజ్.. మార్కెట్‌లోకి ‘పుష్ప’ చీరలు..

 

పవన్ తో దిగిన ఫోటోలని హరీష్ శంకర్ ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ”పవన్ గారితో మంచి ఎనర్జీగా మాట్లాడాం సినిమా గురించి. రెడీగా ఉండండి. త్వరలోనే యాక్షన్ లోకి దిగబోతున్నాము” అని పోస్ట్ చేశారు. దీంతో పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్, రానాతో కలిసి నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా త్వరలో రిలీజ్ అవ్వనుంది.