Bheemla Nayak
Bheemla Nayak: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీని ‘భీమ్లా నాయక్’ పేరుతో దర్శకుడు చంద్ర సాగర్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తుండగా త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. జనవరి 12న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు యూనిట్ ఇప్పటివరకు ప్రకటిస్తూ వస్తుండగా.. ఫైనల్ గా సినిమా విడుదల వాయిదా పడింది.
Bheemla Nayak : వికారాబాద్‌లో ‘భీమ్లానాయక్’ షూటింగ్.. పవన్ కోసం ఎగబడ్డ జనం
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, పాటలు సూపర్ డూపర్ అప్లోజ్ తీసుకురాగా మెగా అభిమానాలు వెయ్యి కళ్ళతో ఈ సినిమా కోసం వేచిఉన్నారు. అయితే.. భీమ్లా నాయక్ పండగ వార్ నుండి తప్పుకుంది. ముందునుండి సినిమాను సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న రిలీజ్ చేస్తామని చెప్పినప్పటికీ దాదాపుగా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే, నిర్మాతలు మాత్రం తగ్గేదిలేదు సంక్రాంతికే వచ్చేస్తామని ధీమాగా చెప్తూ వచ్చారు. పలుమార్లు నిర్మాత చినబాబు సినిమా విడుదలపై క్లారిటీ ఇస్తూ వచ్చారు.
Bheemla Nayak: స్పీడ్ పెంచిన పవర్ స్టార్.. సంక్రాంతి టార్గెట్ అందుకుంటాడా?
కానీ, వాయిదా పుకార్లు మాత్రం ఆగలేదు. అందుకు తగ్గట్లుగానే ఫైనల్ గా భీమ్లా నాయక్ జనవరి నుండి ఫిబ్రవరికి వాయిదా పడింది. ఫిబ్రవరి 25న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఒకవైపు ఆర్ఆర్ఆర్.. మరోవైపు రాధేశ్యామ్ పండగ సీజన్ ను నేషనల్ వైడ్ విడుదల ఉండడంతో భీమ్లా నాయక్ సామరస్యంగా వాయిదా వేసుకున్నారు. ఈ మేరకు ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో చర్చించి నిర్ణయించుకున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.