Bheemla Nayak : ఇదీ పవర్‌స్టార్ స్టామినా.. రిలీజ్ తర్వాత రచ్చ రంబోలానే..

‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఫిలిం నగర్‌లో ఓ క్రేజీ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది..

Bheemla Nayak : ఇదీ పవర్‌స్టార్ స్టామినా.. రిలీజ్ తర్వాత రచ్చ రంబోలానే..

Pk

Updated On : November 23, 2021 / 7:11 PM IST

Bheemla Nayak: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, హ్యాండ్సమ్ హీరో రానా దగ్గుబాటిల క్రేజీ మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’.. పవన్‌కి జోడీగా టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్య మీనన్, రానా పక్కన సంయుక్త మీనన్ నటిస్తున్నారు.. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు.

Bheemla Nayak : నో డౌట్.. సంక్రాంతికే సినిమా..

స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే – డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పవన్, రానా గ్లింప్స్, పాటలకు ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. సంక్రాంతి రిలీజ్‌ కోసం త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకుంటుంది.

Mega Movies : మెగా సందడి.. మూడు నెలలు.. ఆరు సినిమాలు..

రీసెంట్‌గా ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఫిలిం నగర్‌లో ఓ క్రేజీ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. దాదాపు రూ.95 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. ఈ లెక్కన కేవలం రెండే రెండు రోజుల్లో ఈ కలెక్షన్స్ రాబట్టేస్తాడు పవర్‌స్టార్. ఇక ఆడియో, శాటిలైట్, డబ్బింగ్ అండ్ డిజిటల్ రైట్స్ అన్నీ కలుపుకుంటే సాలిడ్ ఫిగర్ వస్తుందని అంటున్నారు.

Bheemla Naayak : ‘ఈసారి కూడా మిస్ అవదు’.. నిర్మాత నాగవంశీ కాన్ఫిడెన్స్!..