Mega Movies : మెగా సందడి.. మూడు నెలలు.. ఆరు సినిమాలు..

వరుసగా అరడజను సినిమాలతో మెగా ఫ్యామిలీ హీరోలు హంగామా చెయ్యబోతుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు..

Mega Movies : మెగా సందడి.. మూడు నెలలు.. ఆరు సినిమాలు..

Mega Family Heroes

Updated On : November 19, 2021 / 2:27 PM IST

Mega Movies: పాండమిక్ తర్వాత కొత్త సినిమాల రిలీజులతో ఇండస్ట్రీలో, బాక్సాఫీస్ బరిలో సందడి నెలకొంది. 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. అయితే వరుసగా అరడజను సినిమాలతో మెగా ఫ్యామిలీ హీరోలు హంగామా చెయ్యబోతుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఒక్కొక్కటిగా థియేటర్లలోకి రాబోతున్న మెగా హీరోల సినిమాలేంటో చూద్దాం..

Bheemla Nayak : నో డౌట్.. సంక్రాంతికే సినిమా..

ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ‘పుష్ప’ మూవీతో మెగా సందడి మొదలుకాబోతోంది. డిసెంబర్ 17న భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది ‘పుష్ప’. తర్వాత డిసెంబర్ 24 (రిలీజ్ డేట్ మారే అవకాశముందని వార్తలు వస్తున్నాయి) మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ మూవీ ‘గని’ తో రాబోతున్నాడు. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు, అల్లు అర్జున్ అన్నయ్య, అల్లు వెంకటేష్ (బాబీ) ఈ సినిమాతో నిర్మాణరంగంలోకి అడుగు పెడుతున్నారు.

RRR Glimpse : ఎన్టీఆర్ – చరణ్ ఫ్యాన్స్ థియేటర్లలో సీట్లు చింపే సీన్ ఇదేనేమో?

2022 జనవరితో కొత్త సినిమాల విడుదలకు కొత్త శుభారంభాన్నివ్వబోతున్నాడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించిన ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు, అభిమానులు ఎతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

Chiru 154 : అరాచకం ఆరంభం.. ఇది చిరు ప్రభంజనం..

ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’.. రానా కోస్టార్, త్రివిక్రమ్ రైటింగ్, సాగర్ కె చంద్ర డైరెక్టర్.. పైగా ప్రోమోస్ అండ్ సాంగ్స్ అన్నీ ప్రామిసింగ్‌గా ఉండడంతో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘భీమ్లా నాయక్’ గా పవర్‌స్టార్ బరిలో దిగబోతున్నారు.

Pushpa Movie : ఐకాన్ స్టార్ క్రేజ్ పీక్స్.. తమిళనాడులో థియేట్రికల్.. మలయాళంలో శాటిలైట్ రైట్స్ ఎంతంటే..

తర్వాత నెల అంటే ఫిబ్రవరి 4న మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండగా.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఆచార్య’ రిలీజ్ కాబోతోంది. ప్రేక్షకాభిమానుల్లో ‘ఆచార్య’ మూవీ మీద మంచి హైప్ ఉంది.

Ghani Teaser : ఆడినా ఓడినా రికార్డ్స్‌లో ఉంటావ్.. గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటావ్..

ఫిబ్రవరి 25న మహా శివరాత్రి కానుకగా విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా.. సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫన్ రైడర్ ‘ఎఫ్ 2’ కి సీక్వెల్‌గా వస్తున్న ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఎఫ్ 3’ మూవీ రిలీజ్ కానుంది. ఇలా మూడు నెలల వ్యవధిలో నెలకు రెండు చొప్పున మొత్తం ఆరు మెగా హీరోల సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.

RRR Movie : ఇదీ తెలుగు సినిమా సత్తా.. ప్రపంచవ్యాప్తంగా పదివేలకు పైనే..