Bheemla Nayak : నో డౌట్.. సంక్రాంతికే సినిమా..

సంక్రాంతి సీజన్‌లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా తమ సినిమా హిట్ కొట్టి తీరుతుందని కన్ఫర్మేషన్ ఇచ్చింది ‘భీమ్లా నాయక్’ టీం..

Bheemla Nayak : నో డౌట్.. సంక్రాంతికే సినిమా..

Bheemla Nayak

Updated On : November 16, 2021 / 10:46 AM IST

Bheemla Nayak: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, హ్యాండ్సమ్ హీరో రానా దగ్గుబాటి కలిసి నటిస్తుండడంతో.. ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ రీమేక్స్‌లో ఒకటిగా సెన్సేషన్ అవుతోంది ‘భీమ్లా నాయక్’ మూవీ.. పవన్‌కి జోడీగా టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్య మీనన్, రానా పక్కన సంయుక్త మీనన్ నటిస్తున్నారు..

Drushyam 2 : సినిమా తీసేలోపు వాడికి సినిమా చూపిద్దాం.. ట్రైలర్ అదిరిందిగా..

పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తుండగా.. స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే – డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పవన్, రానా గ్లింప్స్, పాటలకు ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే.

RRR Movie : ‘నాటు నాటు’ సాంగ్‌కి నడిరోడ్డుపై ఊరమాస్ డ్యాన్స్!

ముందునుండి సినిమాను సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న రిలీజ్ చేస్తామని చెప్తున్నప్పటికీ.. పరిస్థితులు మారుతుండడంతో ‘భీమ్లా నాయక్’ విడుదల వాయిదా తప్పదనే వార్తలు వస్తున్నాయి. ఐదు రోజులు ముందుగా పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ రాబోతోంది.

Bheemla Nayak : రిలాక్స్ అవుతున్న ‘భీమ్లా నాయక్’.. డానియెల్ శేఖర్.. లుక్ అదిరిందిగా!

13న రావాల్సిన మహేష్ ‘సర్కారు వారి పాట’ సమ్మర్‌కి షిఫ్ట్ అయిపోయింది. ఒక రోజు గ్యాప్ తర్వాత మరో క్రేజీ పాన్ ఇండియా ఫిలిం ‘రాధే శ్యామ్’ రిలీజ్ అవుతోంది. ఇంత గందరగోళం మధ్య ‘భీమ్లా నాయక్’ వస్తాడా లేదా అంటే.. కచ్చితంగా వస్తాడని.. సంక్రాంతి సీజన్‌లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా తమ సినిమా సక్సెస్ కొట్టి తీరుతుందని కన్ఫర్మేషన్ ఇచ్చింది ‘భీమ్లా నాయక్’ టీం.

Divyavani : ‘బుల్లెట్ బండి’ సాంగ్‌కి స్టెప్స్ ఇరగదీసిన సీనియర్ నటి దివ్యవాణి..