నయా అవతార్‌లో చెర్రీ భోగి శుభకాంక్షలు – వైరల్ అవుతున్న పిక్

తెలుగు వారందరికీ భోగి శుభాకాంక్షలు తెలుపుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఫోటోలు షేర్ చేశారు..

  • Published By: sekhar ,Published On : January 14, 2020 / 07:32 AM IST
నయా అవతార్‌లో చెర్రీ భోగి శుభకాంక్షలు – వైరల్ అవుతున్న పిక్

Updated On : January 14, 2020 / 7:32 AM IST

తెలుగు వారందరికీ భోగి శుభాకాంక్షలు తెలుపుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఫోటోలు షేర్ చేశారు..

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు నేడు భోగభాగ్యాలను అందించే భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. లేమి చీకట్లనుంచి భోగ వికాసాలకి దారి చూపించే మంటలే భోగి మంటలు అంటూ తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేస్తూ సందడి చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చింరజీవి ఇంట భోగి వేడుక ఘనంగా జరిగింది.

Image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, నిహారిక తదితరులు వేకువనే భోగి మంటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా తీసిన రామ్ చరణ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు వారందరికీ భోగి శుభాకాంక్షలు తెలుపుతూ చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఫోటోలు షేర్ చేశాడు.

Image

ఆర్ఆర్ఆర్ కోసం రామ్ చరణ్ కొత్త గెటప్‌లోకి మారిన సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజులా మీసాలు మెలితిప్పిన చెర్రీ న్యూ లుక్ మెగాభిమానులను ఆకట్టుకుంటోంది. ‘సీతారామరాజు చరణ్’ పేరుతో ఓ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ఈ ఫోటోలను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో, కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం 2020 జూలై 30న పది భాషల్లో భారీగా విడుదల కానుంది. 

 

View this post on Instagram

Happy BHOGI !!!

A post shared by Ram Charan (@alwaysramcharan) on