Power Star Pawan Singh : పవర్ స్టార్ పవన్ పై రాళ్ల దాడి..

ఇటీవల కాలంలో ప్రముఖ నటుల పై సభా వేదిక పై ఉండగానే దాడులు జరుగుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల కన్నడ స్టార్ హీరో దర్శన్ పై కూడా చెప్పుతో దాడి జరిగిన సంఘటన చూశాం. తాజాగా పవర్ స్టార్ పవన్..

Bhojpuri actor and singer Power Star Pawan Singh attacked by stones at live concert

Power Star Pawan Singh : ఇటీవల కాలంలో ప్రముఖ నటుల పై సభా వేదిక పై ఉండగానే దాడులు జరుగుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల కన్నడ స్టార్ హీరో దర్శన్ పై కూడా చెప్పుతో దాడి జరిగిన సంఘటన చూశాం. తాజాగా మరో సినిమా నటుడు పై ఏకంగా రాళ్ల దాడి జరిగింది. భోజ్ పూరి సినీ పరిశ్రమలో పవర్ స్టార్ అనిపించుకుంటున్న పవన్ సింగ్ పై ఈ దాడి జరిగింది. సినిమాలో నటుడు గానే కాదు నిర్మాతగా, మ్యూజిక్ కంపోజర్ గా, సింగర్ గా అలరిస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

Sai Pallavi : ఎన్టీఆర్, చరణ్, బన్నీలలో సాయి పల్లవి ఎవరితో డాన్స్ చేయాలి అనుకుంటుందో తెలుసా?

ఇక హోలీ సందర్భంగా యూపీలోని బల్లియా జిల్లాలో ఒక మ్యూజికల్ కాన్సర్ట్ కి పవన్ సింగ్ హాజరయ్యాడు. అక్కడ స్టేజి పై పాట పాడుతున్న సమయంలో కింద ఆడియన్స్ నుంచి ఒకరు, పవన్ పైకి రాయి విసిరారు. అది నేరుగా వచ్చి పవన్ సింగ్ మొహానికి తగిలింది. దీంతో సీరియస్ అయిన పవన్ సింగ్.. ఈ పని చేసిన వారు గుంపులో ఉండి దాడి చేయడం కాదు, దమ్ముంటే నా ముందుకు వచ్చి దాడి చేయండి అంటూ సవాలు విసిరారు.

Ram Charan : హాలీవుడ్ ప్రేక్షకులకు అయ్యప్ప దీక్ష గురించి చెప్పిన రామ్‍చరణ్!

ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. కాగా జరిగిన సంఘటనకి ఈవెంట్ మేనేజర్ లు షాక్ గురయ్యారు. వెంటనే ఈవెంట్ ని నిలిపివేసి పవన్ సింగ్ ని అక్కడి నుంచి జాగ్రత్తగా పంపించేశారు. ఈ దాడిలో పవన్ సింగ్ మొఖానికి స్వల్పంగా గాయాలు అయ్యాయి. ఇక ఈ సంఘటన పై పోలీసులు విచారణ జరుపుతున్నారు.