Bholaa Mania song promo released from Chiranjeevi Bhola Shankar
Chiranjeevi Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మొన్నటి వరకు స్విట్జర్లాండ్‌లో షూటింగ్ చిత్రీకరణ జరుపుకోగా ఇటీవలే తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. కాగా సినిమా విడుదలకు రెండు నెలలు సమయం ఉన్నా గాని ఇప్పటి నుంచే భళా మ్యానియా చూపిస్తా అంటున్నాడు చిరంజీవి. ఈ క్రమంలోనే మూవీలోని మొదటి సింగల్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేశాడు.
Sharwanand : మొదలైన శర్వానంద్ పెళ్లి సంబరం.. వీడియో వైరల్!
మూవీలోని భోళా మ్యానియా సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ సినిమాకి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ని అందించగా శేఖర్ మాస్టర్ డాన్స్ కోరియోగ్రఫీ చేశాడు. ప్రోమో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఫుల్ లిరికల్ సాంగ్ ని 4న రిలీజ్ చేయబోతున్నారు. కాగా దర్శకుడు మెహర్ రమేష్.. వింటేజ్ చిరులోని డాన్స్ గ్రేస్ ని పరిచయం చేస్తాను అంటున్నాడు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) చిరుకి చెల్లి పాత్రలో కనిపిస్తుంది. హీరో సుశాంత్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.
కాగా ఈ మూవీ తమిళ హిట్ మూవీ ‘వేదాళం’కి రీమేక్ గా వస్తుంది. స్మగ్లింగ్, గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ తో సిస్టర్ సెంటిమెంట్ లో ఈ సినిమా ఉండబోతుంది. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత చిరంజీవి చేస్తున్న సినిమా కవడంతో ఈ మూవీ పై అభిమానుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి చిరు వాల్తేరు వీరయ్య హిట్టుని కొనసాగిస్తాడు? లేదా? చూడాలి. ఆగష్టు 11న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.