Bhoothaddam Bhaskar Narayana Movie Success Meet Movie Unit came in Lungis
Bhoothaddam Bhaskar Narayana : శివ కందుకూరి(Shiva Kandukuri), రాశి సింగ్ జంటగా పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ నిన్న మార్చ్ 1న విడుదలై మంచి విజయం సాధించింది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కి మైథలాజి కాన్సెప్ట్ జోడించి ప్రేక్షకులని మెప్పించారు. సెకండ్ హాఫ్ అయితే ట్విస్ట్ లతో, క్లైమాక్స్ అదరగొట్టి భూతద్ధం భాస్కర్ నారాయణ హిట్ కొట్టింది. తాజాగా భూతద్ధం భాస్కర్ నారాయణ మూవీ యూనిట్ నేడు సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
భూతద్ధం భాస్కర్ నారాయణ సక్సెస్ సెలబ్రేషన్స్ లో మూవీ యూనిట్ అంతా పాల్గొన్నారు. అయితే ఈ సెలబ్రేషన్స్ కి మగవాళ్ళంతా లుంగీలు కట్టుకొని రావడం విశేషం. ఈ సినిమాలో హీరో ఎక్కువగా లుంగీ కట్టుకొని కనిపిస్తాడు. డిటెక్టివ్ గా హీరో పాత్ర సక్సెస్ అయింది. దీంతో మూవీ యూనిట్ ఇలా సక్సెస్ సెలబ్రేషన్స్ కి లుంగీలు కట్టుకొచ్చి సందడి చేశారు. చిత్రయూనిట్ అంతా మాట్లాడిన తర్వాత చివర్లో అందరూ కలిసి నాటు నాటు పాటకి స్టెప్పులు వేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
Telugu Film #BhoothaddamBhaskarNarayana ? had a decent day 1 at the box-office. with the spread of positive word of mouth from public it is set have a superb weekend at the box-office.@iam_shiva9696 @RaajPurushotham @RashiReal_ @VijaiBulganin pic.twitter.com/Gm4GQ3vkOT
— Ramesh Bala (@rameshlaus) March 2, 2024
ఇక ఈ సినిమాలో షఫీ, శివ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. నటుడు దేవి ప్రసాద్ క్లైమాక్స్ లో తన నటనతో అదరగొట్టేసారు. శ్రీచరణ్ పాకాల అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాకు చివర్లో సీక్వెల్ లీడ్ కూడా ఇవ్వడం గమనార్హం.
Also Read : Kalki 2898 AD Trailer Update : కల్కి 2898AD ట్రైలర్ అప్డేట్.. ట్రైలర్ వచ్చేది అప్పుడే..
భూతద్ధం భాస్కర్ నారాయణ సక్సెస్ మీట్ లో హీరో శివ కందుకూరి మాట్లాడుతూ.. సినిమా స్టార్ చేసినప్పుడు మంచి అవుట్ పుట్ వస్తే చాలు అనుకున్నాం. కానీ ఇప్పుడు పెద్ద హిట్ అయింది. మాకు ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇచ్చిన ఆడియన్స్ కి చాలా థాంక్స్. సినిమాకి రివ్యూస్ కూడా బాగా వచ్చాయి. తొలి సినిమాతోనే నిర్మాతలు స్నేహాల్, శశిధర్, కార్తీక్, దర్శకుడు పురుషోత్తం రాజ్ సక్సెస్ కొట్టారు. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ సినిమాలని ప్రోత్సహిస్తారని మరోసారి రుజువైయింది అని అన్నారు.
The Grand Success Celebrations were filled with excitement as the #BhoothaddamBhaskarNarayana ?️♂️ team celebrated their thrilling blockbuster success ??#ThrillingBlockbusterBBN in Cinemas Now
Book your tickets now – https://t.co/L4G68ocNjr@iam_shiva9696 @RaajPurushotham… pic.twitter.com/KelkiVRDiu
— Teju PRO (@Teju_PRO) March 2, 2024