Kalki 2898 AD Trailer Update : కల్కి 2898AD ట్రైలర్ అప్డేట్.. ట్రైలర్ వచ్చేది అప్పుడే..

తాజాగా మూవీ యూనిట్ కల్కి సినిమా ట్రైలర్ అప్డేట్ ఇచ్చింది.

Kalki 2898 AD Trailer Update : కల్కి 2898AD ట్రైలర్ అప్డేట్.. ట్రైలర్ వచ్చేది అప్పుడే..

Prabhas Nag Ashwin Kalki 2898 AD Movie Trailer Update

Updated On : March 2, 2024 / 7:08 PM IST

Kalki 2898 AD Trailer Update : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) త్వరలో ‘కల్కి 2898AD’ సినిమాతో రాబోతున్నాడు. మే 9 గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని నిర్మాత అశ్విని దత్ 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో కల్కి సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుంది అని అంతా భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, రానా, రాజేంద్రప్రసాద్.. పలువురు స్టార్స్ నటిస్తుండగా మరికొంతమంది స్టార్స్ కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తారని సమాచారం.

Also Read : Varalaxmi Sarathkumar : పెళ్లిపీటలు ఎక్కబోతున్న లేడీ విలన్.. నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్..

ఇక కల్కి సినిమా మహాభారతంలో మొదలయి 2898వ సంవత్సరంలో ముగుస్తుందని, 6000 సంవత్సరాల మధ్య జరిగే కథ అని ఇటీవల దర్శకుడు ఓ ఈవెంట్ లో చెప్పి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచారు. తాజాగా మూవీ యూనిట్ కల్కి సినిమా ట్రైలర్ అప్డేట్ ఇచ్చింది. కల్కి సినిమా ట్రైలర్ ఏప్రిల్ 9న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో అభిమానులు ఆసక్తిగా ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా మే 9న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది.