Bhumi Pednekar: అసిస్టెంట్‌తో చెప్పులు విప్పించుకున్న హీరోయిన్.. ట్రోలింగ్ చేస్తోన్న నెటిజెన్స్!

బాలీవుడ్ బ్యూటీ భూమి ఫెడ్నేకర్‌ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. బాలీవుడ్‌లో మంచి సక్సెస్‌ఫుల్ మూవీల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. హిందీలో భాగమతి సినిమాను రీమేక్ చేసిన ఈ బ్యూటీ ఆ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే ఎలాంటి వివాదాలకు తావివ్వని ఈ బ్యూటీ, తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరుకావడంతో ఆమె ఓ వివాదంలో ఇరుక్కుంది.

Bhumi Pednekar Trolled As Her Assistant Removes Her Shoes

Bhumi Pednekar: బాలీవుడ్ బ్యూటీ భూమి ఫెడ్నేకర్‌ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. బాలీవుడ్‌లో మంచి సక్సెస్‌ఫుల్ మూవీల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. హిందీలో భాగమతి సినిమాను రీమేక్ చేసిన ఈ బ్యూటీ ఆ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే ఎలాంటి వివాదాలకు తావివ్వని ఈ బ్యూటీ, తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరుకావడంతో ఆమె ఓ వివాదంలో ఇరుక్కుంది.

Bhumi Pednekar : నడుము అందాలతో భుమి పెడ్నేకర్ పరువాలు..

భూమి ఫెడ్నేకర్‌ తాజాగా ఓ ఈవెంట్‌కు గెస్టుగా వెళ్లింది. అక్కడ జ్యోతి ప్రజ్వలన చేసేందుకు భూమి తన చెప్పులు స్టేజీ వద్ద తీసేందుకు ప్రయత్నించింది. కానీ, వాటిని ఆమె తీయలేకపోయింది. దీంతో తన అసిస్టెంట్‌ను పిలిచింది. అతడు ఆమె వద్దకు వచ్చి, చెప్పులు తీయడంలో సాయం చేశాడు. ఆ తర్వాత ఆమె స్టేజ్‌ పైకి వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అయితే అసిస్టెంట్‌తో చెప్పులు తీయించిందని భూమిని నెట్టింట ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.

Bhumika Chawla : మంచులో భూమిక న్యూ ఇయర్ వేడుకలు..

ఒక హీరోయిన్ ఇలా తన అసిస్టెంట్‌తో చెప్పులు తీయంచడం ఏమిటని నెటిజన్లు భూమిపై ఫైర్ అవుతున్నారు. ఇక టాలీవుడ్‌లో భూమి ఫెడ్నేకర్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నాడు.