నీళ్ల కోసం కొట్లాట.. బాబా భాస్కర్ పై వరుణ్ ఫైర్

  • Publish Date - October 2, 2019 / 10:39 AM IST

బిగ్ బాస్ ఇంట్లో పదకొండో వారం చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ వీక్ లో మొదటి రెండురోజులపాటు రాళ్లే రత్నాలు అనే ఎలిమినేషన్ కి సంబంధించిన నామినేషన్ ప్రక్రియా కొనసాగింది. ఇందులో ముందుగా రాహూల్ నామిమినేట్ కాగా.. తర్వాత పునర్ణవి, వరుణ్, మహేశ్ లు నామినేషన్లో నిలిచారు. 

ఇక ఈ రోజు ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ‘బ్యాటిల్‌ ఆఫ్‌ ది మెడాలియన్‌’ అనే టాస్క్‌ ఇవ్వగా.. దీనికోసం ఇంటిసభ్యులు నానా హంగామా సృష్టించారు. బయటజనాలు నీటికోసం బిందెలతో ఎలా కొట్టుకుంటారో.. ఇంటి సభ్యులు కూడా నీటికోసం అలాగే కొట్లాడుకున్నారు. 

అయితే దీనికి సంబంధించిన ప్రోమోని యూనిట్ విడుదల చేసింది. ఈ వీడియోలో అంతా బాగానే జరుగుతోంది అనుకునేలోగా.. ప్రోమో చివర్లో వరుణ్, బాబా భాస్కర్ ఇద్దరు అరుచుకుంటున్నారు. మరి అదంతా సరదానా.. లేక సీరియస్ గొడవా తెలియాలంటే ఈ రోజు జరిగే ఎపిసోడ్ చూడాల్సిందే.