Bigg Boss 7 contestants beating together video gone viral
Bigg Boss 7 : బిగ్‌బాస్ రియాలిటీ షో ప్రపంచవ్యాప్తంగా హిట్ అయ్యి.. బిగ్గెస్ట్ రియాలిటీ షో అయ్యింది. ఇక ఈ షో ఇండియాలోని పలు లాంగ్వేజ్స్ లో కూడా ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు, తమిళంలో సీజన్ 7 జరుగుతుంది. ఈ రెండు భాషల్లో ఈ సీజన్ చాలా హోరాహోరీగా జరుగుతుంది. ఇటు తెలుగులో, అటు తమిళంలో కూడా కంటెస్టెంట్స్ మధ్య ఓ రేంజ్ ఫైట్ జరుగుతుంది. అయితే తమిళ్ బిగ్‌బాస్ లో ఇది కొంచెం శృతిమించి.. సీరియస్ అయ్యి ఒకరిని ఒకరు గాయపరుచుకునే స్థాయి వరకు వస్తుంది.
తాజాగా తమిళ్ బిగ్‌బాస్ లోని ఇద్దరి కంటెస్టెంట్స్ మధ్య జరిగిన పోటీ.. సీరియస్ నేలకేసి కొట్టుకునే వరకు వచ్చింది. రీసెంట్ గా టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో బిగ్‌బాస్ ఒక టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ టాస్క్ లో భాగంగా హౌస్ లోని మెంబర్స్ అంతా పోటీలోకి దిగి పోరాడడం మొదలు పెట్టారు. అయితే ఈ పోటీ.. కంటెస్టెంట్స్ విజయ్, ప్రదీప్ మధ్య పోరుగా మారింది. ప్రదీప్, విజయ్ మెడ పట్టుకోవడం, ఆ తరువాత విజయ్ కోపంతో ప్రదీప్ ని ఎత్తి నేలకేసి కొట్టడం జరిగిపోయింది. దీంతో ప్రదీప్ గాయం అయ్యినట్లు కనిపిస్తుంది.
Aslo read : Nayanthara : కొడుకుకి పాదసేవ చేసుకుంటున్న నయనతార.. లేడీ సూపర్ స్టార్ అయినా అమ్మే కదా..
ఈ సంఘటనతో హౌస్ లోని మెంబెర్స్ తో పాటు చూసిన ఆడియన్స్ కూడా షాక్ తిన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అసలు గేమ్ ఆడడానికి వెళ్లిన కంటెస్టెంట్స్.. ఇలా సీరియస్ అయ్యి కొట్టుకోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయం పై తమిళ బిగ్ బాస్ హోస్ట్ అయిన కమల్ హాసన్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. కాగా ఈ సీజన్ తమిళ్ బిగ్‌బాస్ చాలా వరకు ఆడియన్స్ కి తెలిసిన స్టార్స్ ఎంట్రీ ఇచ్చారు.
First half of Vijay Pradeep fight #BiggBossTamil7 pic.twitter.com/JAdJJnLZQ2
— BB Views (@HarishKuma53838) October 19, 2023
OMG…#biggbosstamil #biggbosstamil7 pic.twitter.com/HIX8c30zFN
— Imadh (@MSimath) October 19, 2023