Bigg Boss 7 Day 4 : బిగ్‌బాస్ కాదు.. బొక్కలో హౌస్.. శివాజీ ఫైర్.. రతిక, ప్రశాంత్ ప్రేమ యవ్వారం చూడలేకపోతున్నాంగా..

హౌస్ లో కాఫీ(Coffee) కోసం పర్ఫార్మెన్స్ చేయమనగా ఎవరికి వాళ్ళు సోలోగా రెచ్చిపోయారు. శివాజీ(Sivaji) అయితే కాఫీ కోసం రెచ్చిపోయి ఇది బిగ్ బాస్ హౌస్ కాదు బొక్కలో హౌస్ అంటూ ఫైర్ అయ్యాడు.

Bigg Boss 7 Day 4 highlights Prashanth Rathika Love Journey Shivaji Fires on Bigg Boss

Bigg Boss 7 Day 4 :  మొదటి రోజు సరదాగా సాగిన షో రెండో రోజు నుంచి అసలు యాక్టివిటీలను బయటకు తీస్తుంది. గొడవలు పడటాలు, ప్రేమ వ్యవహారాలు అన్ని జరుగుతున్నాయి. ఇప్పటికే మొదటి వారం నామినేషన్స్ కూడా అయిపోయాయి. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కంటెండర్స్ కోసం కుస్తీ పోటీలు పెట్టారు. బాగా బలవంతమైన వాళ్ళని లోపలి పంపి వాళ్ళతో కుస్తీ పట్టి గెలిచినా వాళ్ళని కంటెండర్స్ గా ప్రకటిస్తారు అని చెప్పడంతో అందరూ భయపడుతూనే ఈ గేమ్ ఆడారు. ఫైనల్ గా ప్రియాంక జైన్, ఆట సందీప్ కంటెండర్స్ గా అర్హత సాధించారు.

ఇక హౌస్ లో కాఫీ(Coffee) కోసం పర్ఫార్మెన్స్ చేయమనగా ఎవరికి వాళ్ళు సోలోగా రెచ్చిపోయారు. శివాజీ(Sivaji) అయితే కాఫీ కోసం రెచ్చిపోయి ఇది బిగ్ బాస్ హౌస్ కాదు బొక్కలో హౌస్ అంటూ ఫైర్ అయ్యాడు. దీంతో బిగ్ బాస్ పిలిచి చివాట్లు పెట్టి శివాజీ బీపీ చెక్ చేయించుకోమన్నాడు. కానీ ఆ తర్వాత శివాజీకి కాఫీ పంపించాడు.

మరోవైపు ప్రశాంత్, రతికల ప్రేమ వ్యవహారం నాలుగు రోజులకే ముదిరిపోయింది. ప్రశాంత్ గుండె రతిక రతిక అని కొట్టుకుంటుంది అని రతిక స్టెతస్కోప్ పెట్టి మరీ చెక్ చేసి చెప్పడం ఓవర్ గా అనిపించింది. దీనికి బిగ్ బాస్ మధ్యలో ఉండటం మరింత ఓవర్ గా అనిపించింది. కాసపు ఎపిసోడ్ వీరి ప్రేమ మీదే నడిపించారు. ఇద్దరూ తెగ సిగ్గుపడిపోతుంటే చూడలేకపోతున్నాం అంటూ నెటిజన్లు, ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

Vishal : నిర్మాతలు బ్లాక్ మెయిల్ చేసేవాళ్ళు.. అందుకే నిర్మాణ సంస్థ మొదలుపెట్టా.. విశాల్ సంచలన వ్యాఖ్యలు..

శోభా శెట్టిని ఎవర్నైనా ఫ్లర్ట్ చేయమని చెప్పగా టేస్టీ తేజని ఫ్లర్ట్ చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఒక్కొక్కరిని రూమ్ లోకి పిలిచి ఇండివిడ్యుయల్ టాస్క్ ఇచ్చారు. మరి ఆ టాస్కులు ఏంటో ఇవాళ్టి ఎపిసోడ్ లో చూడాలి.