Bigg Boss 7 Day 40 : బిగ్‌బాస్ లో రెండో కెప్టెన్ ఎవరో తెలుసా? ఫస్ట్ కెప్టెన్సీ వచ్చినా ఏమి చేయలేకపోయిన ప్రశాంత్..

బిగ్‌బాస్ రెండో కెప్టెన్సీ కోసం కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ పోటుగాళ్ళు టీం, పాత్ కంటెస్టెంట్స్ ఆటగాళ్ల మధ్యలో గేమ్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Bigg Boss 7 Day 40 Highlights New Captain in Bigg Boss

Bigg Boss 7 Day 40 :  బిగ్‌బాస్ రెండో కెప్టెన్సీ కోసం కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ పోటుగాళ్ళు టీం, పాత్ కంటెస్టెంట్స్ ఆటగాళ్ల మధ్యలో గేమ్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం వరకు ఆరు గేమ్స్ నిర్వహించగా చెరో మూడు గేమ్స్ గెలిచారు. ఇక శుక్రవారం ఎపిసోడ్ లో హూ ఈజ్ ది బెస్ట్ అని ఓ బాల్ గేమ్ ఇవ్వగా ఆటగాళ్లు గెలిచారు . దీంతో పాత కంటెస్టెంట్స్ లో ఎవరో ఒకరు కెప్టెన్సీ అవుతారు.

ఆటగాళ్లు టీంలోని కంటెస్టెంట్స్ అందరికి బెలూన్స్, సూదులు ఇచ్చి వాళ్ళ బెలూన్ కాపాడుకుంటూ పక్కనోళ్ళ బెలూన్ పగలగొట్టాలి అనే గేమ్ ఇవ్వడంతో అందరూ తలపడ్డారు. ఈ గేమ్ లో యావర్ గెలిచి బిగ్‌బాస్ హౌస్ లో రెండో కెప్టెన్ గా యావర్ నిలిచాడు.

ఇక ప్రశాంత్ కెప్టెన్సీ పోయింది. అయితే శివాజీ వల్లే తాను కెప్టెన్ అయ్యానని తనని తానే తక్కువ చేసుకున్నాడు ప్రశాంత్. ప్రశాంత్ కెప్టెన్సీ అయినా ఏం చేయలేదు అని బిగ్‌బాస్ చెప్పి గత ఎపిసోడ్స్ లో ఫైర్ అయిన సంగతి తెలిసిందే. కంటెస్టెంట్స్ కూడా మళ్ళీ అదే చెప్పారు. అయితే కంటెస్టెంట్స్ ప్రశాంత్ చేసిన తప్పేంటో చెప్తుంటే వినకుండా హడావిడి చేశాడు. దీంతో ప్రశాంత్ తనని తానే మైనస్ చేసుకున్నాడు.

Also Read : SDT 17 : సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమా అనౌన్స్.. SDT 17 త్రిశూలంతో పవర్ ఫుల్ లుక్..

అలాగే కెప్టెన్సీ టాస్క్ ముందు లాస్ట్ గేమ్ సమయంలో ఆటగాళ్లు – పోటుగాళ్ళు మధ్యలో బాల్ గేమ్ పెట్టగా పోటుగాళ్ళు నుంచి పాల్గొనడానికి పూజా – అశ్విని పోటీ పది ఒకరి మీద ఒకరు గొడవ పడ్డారు. ఇద్దరు సీరియస్ అయి తిట్టుకున్నారు. అంతకుముందు వంట దగ్గర యావర్ కి మిగిలిన వాళ్లకి గొడవ అయింది. వంట మండుతున్న ప్రియనకే ఏడ్చేసింది. మొత్తానికి శుక్రవారం ఎపిసోడ్ కెప్టెన్సీ కోసం సాగింది. ఇక నేడు వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఎవరి మీద ఫైర్ అవుతాడో చూడాలి.