Bigg Boss 7 Day 63 Highlights Teja Eliminated from House
Bigg Boss 7 Day 63 : బిగ్‌బాస్ తొమ్మిది వారాలు పూర్తి చేసేసుకుంది. నిన్నటి ఆదివారం ఎపిసోడ్ లో మొదట నాగార్జున స్పెషల్ సాంగ్స్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఆదివారం ఫన్ డే కావడంతో కాసేపు కంటెస్టెంట్స్ తో గేమ్ ఆడించాడు నాగ్. ఆ తర్వాత కొన్ని సామెతలు ఉన్న బోర్డ్స్ ఇచ్చి అవి కంటెస్టెంట్స్ లో ఎవరికీ ఏది సరిపోతుందో వాళ్ళ మెడలో వేయమన్నారు. దీంతో కంటెస్టెంట్స్ అంతా తమ అభిప్రాయాలను ఆ సామెతల్లో చూపించారు.
తర్వాత ‘జిగర్తాండ డబల్ ఎక్స్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సూర్య, లారెన్స్ వచ్చి హౌస్ లో కాసేపు సందడి చేశారు. ఆ తర్వాత ఈషరెబ్బ హౌస్ లోకి వెళ్లి అమ్మాయిలతో పీరియడ్స్ ప్రాబ్లమ్స్ పై చర్చించి వాటి గురించి అవగాహన కల్పిస్తూ మాట్లాడింది. నామినేషన్స్ లో ఉన్న వారిని ఒక్కొక్కరిగా సేవ్ చేసుకుంటూ వచ్చిన నాగ్ చివర్లో తేజ, రతికలను ఉంచాడు. రతిక ఎలిమినేట్ అయిపోతానేమో మళ్ళీ అని ముందే ఏడ్చేసింది. అయితే తేజ ఎలిమినేట్ అయ్యాడని నాగార్జున ప్రకటించాడు.
దీంతో తేజ అందరికి గుడ్ బై చెప్పి హౌస్ నుంచి బయటకు వస్తుంటే శోభాశెట్టి భోరున ఏడ్చేసింది. నువ్వు లేకుండా హౌస్ లో ఎలా ఉండాలి అంటూ ఏడుస్తూ తేజని వెళ్లొద్దు అంటూ ఆపింది. ఎలిమినేట్ అయినందుకు తేజ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. స్టేజిపైకి వచ్చిన తేజ వెళ్లేముందు కంటెస్టెంట్స్ కి మార్కులు ఇవ్వమని నాగ్ అడగడంతో ఒక్కొక్కరికి మార్కులు ఇచ్చాడు.
Also Read : Varun Lavanya : ఘనంగా వరుణ్ లావణ్య రిసెప్షన్.. తరలి వచ్చిన సినీ ప్రముఖులు..
తేజ 10 మార్కులకు గాను శోభాశెట్టికి 20 మార్కులు ఇచ్చాడు. గౌతమ్ కి 8,అర్జున్ కి 8, యావర్ కు 10, భోలేకు 7, అశ్వినికి 8, ప్రశాంత్ కి 9, ప్రియాంకకు 10, అమర్ దీప్ కు 9, శివాజీకి 8, రతికకు 5 మార్కులు ఇచ్చాడు తేజ.