Varun Lavanya : ఘనంగా వరుణ్ లావణ్య రిసెప్షన్.. తరలి వచ్చిన సినీ ప్రముఖులు..

నిన్న ఆదివారం నాడు హైదరాబాద్ లో వరుణ్ లావణ్య రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు.

Varun Lavanya : ఘనంగా వరుణ్ లావణ్య రిసెప్షన్.. తరలి వచ్చిన సినీ ప్రముఖులు..

Varun Tej Lavanya Tripathi Grand Wedding Reception Happened in Hyderabad

Updated On : November 6, 2023 / 10:51 AM IST

Varun Lavanya : వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) పెళ్లి నవంబర్ 1న ఇటలీలోని(Italy) టస్కనీలో హిందూ సాంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా జ‌రిగింది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. పెళ్ళికి వారం రోజుల ముందే మెగా ఫ్యామిలీ అంతా ఇటలీ వెళ్లి నాలుగు రోజుల పాటు పెళ్లి సందడి ఘనంగా చేశారు.

Varun Tej Lavanya Tripathi Grand Wedding Reception Happened in Hyderabad

రెండు రోజుల క్రితమే మెగా ఫ్యామిలీ, కొత్త జంట వరుణ్ లావణ్య హైదరాబాద్ కి చేరుకున్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో మెగా అభిమానులు వారిపై పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. ఇక నిన్న ఆదివారం నాడు హైదరాబాద్ లో వరుణ్ లావణ్య రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు.

Varun Tej Lavanya Tripathi Grand Wedding Reception Happened in Hyderabad

Also Read : Varun Lavanya Wedding Reception : ఘనంగా వరుణ్ లావణ్య వెడ్డింగ్ రెసెప్షన్.. ఫొటోలు..

వరుణ్ లావణ్య రిసెప్షన్ కి రెండు ఫ్యామిలీలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, పలువురు మెగా అభిమాన సంఘాల నాయకులు హాజరయ్యారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియచేశారు. వరుణ్ – లావణ్య వెడ్డింగ్ రెసెప్షన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Varun Tej Lavanya Tripathi Grand Wedding Reception Happened in Hyderabad