Bigg Boss 7 Day 77 : ఎలిమినేషన్స్ విషయంలో నాగ్ నిర్ణయం.. ఈ వారం ఇలా.. వచ్చేవారం అలా..

నాగార్జున ఎంట్రీ తర్వాత ప్రతి వారం సండే ఎపిసోడ్ ఫండే ఎపిసోడ్ గా ఉండేది కానీ ఇకపై అలా ఉండదు అని క్లారిటీ ఇచ్చాడు.

Bigg Boss 7 Day 77 Highlights New Friends in House

Bigg Boss 7 Day 77 : శనివారం కంటెస్టెంట్స్ అందర్నీ నాగార్జున(Nagarjuna) తిట్టడంతో సరిపోయింది. చివర్లో యావర్ తప్పు గేమ్ ఆడాడు అని ప్రూవ్ అవ్వడంతో తన ఎవిక్షన్ పాస్ ని తిరిగి ఇచ్చేశాడు. ఇక నిన్న ఆదివారం ఎపిసోడ్ లో అంతా ఈ ఎవిక్షన్ పాస్ గురించే మాట్లాడారు. నాగార్జున ఎంట్రీ తర్వాత ప్రతి వారం సండే ఎపిసోడ్ ఫండే ఎపిసోడ్ గా ఉండేది కానీ ఇకపై అలా ఉండదు అని క్లారిటీ ఇచ్చాడు.

కంటెస్టెంట్స్ అందరికి యాడ్ ఏ ఫ్రెండ్, బ్లాక్ ఏ హౌస్‌మేట్ అనే టాస్క్ ఇచ్చాడు నాగార్జున. ఇందులో కంటెస్టెంట్స్ అందరూ హౌస్ లో ఎవర్ని కొత్తగా ఫ్రెండ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఎవర్ని బ్లాక్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఆ ట్యాగ్స్ ఇవ్వాలని చెప్పాడు నాగ్.

ఈ టాస్క్ లో గౌతమ్.. ప్రశాంత్ కి ఫ్రెండ్ ట్యాగ్ ఇవ్వగా, శోభాశెట్టికి బ్లాక్ ఏ హౌస్‌మేట్ ట్యాగ్ ఇచ్చాడు. అమర్ దీప్ కూడా ప్రశాంత్ కి ఫ్రెండ్ ట్యాగ్ ఇవ్వగా, రతికకు బ్లాక్ ఏ హౌస్‌మేట్ ట్యాగ్ ఇచ్చాడు. రతిక.. శోభాశెట్టికి ఫ్రెండ్ ట్యాగ్ ఇవ్వగా, అమర్ దీప్ కి బ్లాక్ ఏ హౌస్‌మేట్ ట్యాగ్ ఇచ్చింది. శోభాశెట్టి.. రతికకు ఫ్రెండ్ ట్యాగ్ ఇవ్వగా, గౌతమ్ కి బ్లాక్ ఏ హౌస్‌మేట్ ట్యాగ్ ఇచ్చింది. అశ్విని.. శోభాశెట్టికి ఫ్రెండ్ ట్యాగ్ ఇవ్వగా, గౌతమ్ కి బ్లాక్ ఏ హౌస్‌మేట్ ట్యాగ్ ఇచ్చింది. యావర్.. శోభాశెట్టికి ఫ్రెండ్ ట్యాగ్ ఇవ్వగా, గౌతమ్ కి బ్లాక్ ఏ హౌస్‌మేట్ ట్యాగ్ ఇచ్చాడు. ప్రశాంత్.. అమర్ దీప్ కి ఫ్రెండ్ ట్యాగ్ ఇవ్వగా, రతికకు బ్లాక్ ఏ హౌస్‌మేట్ ట్యాగ్ ఇచ్చాడు. అర్జున్.. శివాజీకు ఫ్రెండ్ ట్యాగ్ ఇవ్వగా, యావర్ కి బ్లాక్ ఏ హౌస్‌మేట్ ట్యాగ్ ఇచ్చాడు. శివాజీ.. అర్జున్ కి ఫ్రెండ్ ట్యాగ్ ఇవ్వగా, రతికకు బ్లాక్ ఏ హౌస్‌మేట్ ట్యాగ్ ఇచ్చాడు. చివరగా ప్రియాంక.. ప్రశాంత్ కి ఫ్రెండ్ ట్యాగ్ ఇవ్వగా, అశ్వినికి బ్లాక్ ఏ హౌస్‌మేట్ ట్యాగ్ ఇచ్చింది.

అయితే ఇన్నాళ్లు హౌస్ లో గొడవపడిన వాళ్ళు ఫ్రెండ్స్ ట్యాగ్ ఇచ్చుకోవడం, క్లోజ్ గా ఉన్న వాళ్ళు బ్లాక్ ఏ హౌస్‌మేట్ ట్యాగ్ ఇచ్చుకోవడంతో అంతా ఆశ్చర్యపోయారు. మరి రేపు నామినేషన్స్ లో ఇలాగే ఉంటారా మళ్ళీ అంతకుముందు లాగే గొడవలు పడతారా చూడాలి ఈ కొత్త ఫ్రెండ్స్. మొత్తం మీద ప్రశాంత్, శోభాశెట్టిలకు ఎక్కువ ఫ్రెండ్ ట్యాగ్స్ వచ్చాయి. గౌతమ్, రతికలకు ఎక్కువ బ్లాక్ ఏ హౌస్‌మేట్ ట్యాగ్స్ వచ్చాయి.

అనంతరం బిగ్ బాస్ లోకి కోటబొమ్మాళి PS సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రయూనిట్ నుంచి శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ వచ్చి సందడి చేశారు. ఈ క్రమంలో శ్రీకాంత్ – శివాజీ తమ పాత స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి పలు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అలా కాసేపు సరదాగా సాగిపోయింది.

Also Read : Bigg Boss 7 Day 76 : ఇక నుంచి కెప్టెన్సీ టాస్క్ లు ఉండవు.. ఆ పదాలు బ్యాన్.. కంటెస్టెంట్స్ కి వీకెండ్ షాక్ ఇచ్చిన నాగార్జున..

అనంతరం చివర్లో నామినేషన్స్ ప్రక్రియను పెట్టారు నాగార్జున. మొదట యావర్, ప్రియాంకలను సేవ్ చేశారు. ఆ తర్వాత అర్జున్, అమర్ దీప్ లను సేవ్ చేశారు. ఆ తర్వాత శోభాశెట్టి, రతికలను సేవ్ చేశారు. చివరకు గౌతమ్, అశ్వినిలని మిగల్చగా కాసేపు సస్పెన్స్ తర్వాత ఇద్దరూ సేవ్ అయ్యారని నాగార్జున చెప్పడంతో కంటెస్టెంట్స్ అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఈ వారం ఎలిమినేషన్ లేకపోయినా వచ్చేవారం మాత్రం డబల్ ఎలిమినేషన్ ఉంటుందని, ఇద్దరు హౌస్ నుంచి వెళ్ళిపోతారని చెప్పారు నాగ్. మరి వచ్చేవారం ఏ ఇద్దరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు